ప్రతి ఒక్క భారతీయుడూ తెలుసుకోవలసిన గొప్ప వ్యక్తి

September 22, 2016

ఈ ఫోటోలో ఉన్నది సాధారణ వ్యక్తి అనుకుంటున్నారా………..? కాదు……..కానే కాదు.

మన దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి , ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశ భక్తుడు.

ప్రతి ఒక్క భారతీయిడూ ఇతని ధైర్యం, సాహసం , త్యాగం గురించి తెలుసుకొవాలి.

ravindra-koushik

ఇతని పేరు రవీందర్ కౌశిక్ , ఫేమస్ ఇండియన్ ఏజంట్. ఇతనిని ‪బ్లాక్ టైగర్‬ అని పిలుస్తారు.

రవీందర్ 1952 లొ జలందర్ లొ జన్మించారు.
తన 20 వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW లొ చేరారు.

ఆరోజులలో పాకిస్తాన్ కు Under cover ఏజెంట్ గా వెళ్ళడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో, నేను వెళతాను అని ధైర్యంగా ముందుకు వచ్చాడు.

అందుకోసం ఉర్ధూ నేర్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు,
అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ 1975 లొ పాకిస్థాన్ కు వెళ్ళాడు.

పాకిస్థాన్ కు అనుమానం రాకుండా ఉండటానికి ముందుగా కరాచి యూనివర్శిటిలొ LLB పూర్తిచేసి,
తరువాత పెద్ద హోదాలో పాకిస్తాన్ ఆర్మీలొ చేరాడు.

అప్పటి నుండి 1983 వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్నిRAW ,Indian Army కు పంపించేవాడు. పాకిస్థాన్ వాళ్ళు ఇండియాని దొంగ దెబ్బ తీయాలనుకున్న ప్రతిసారీ ముందుగానే సమాచారం యిచ్చి కాపాడేవాడు.

కాని దురద్రుష్టవశాతూ మసిహ అనే మరొక ఏజెంట్ చేసిన తప్పువలన
రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపొయాడు.

అప్పటి నుండి 16 సంవత్సరాల పాటు ఇండియా రహస్యాలు చెప్పమని అతన్ని తీవ్రంగా హింసించారు.

ఆయన మలవిసర్జనాలను ఆయన చేతే బలవంతంగా తినిపిస్తూ, అనేక చిత్రహింసలు పెట్టినప్పటికీ ,
గొప్ప దేశ భక్తుడైన ఈ వీరుడు ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదు.

పాకిస్తాన్ జైలులో నరకయాతన అనుభవించాడు.

మన భారత ప్రభుత్వం ఎప్పటికైనా తనను కాపాడుతుందని ఎదురు చూసీ…… చూసీ……… చివరికి TB వ్యాధి సోకి 1998 లో అక్కడే మరణించారు.

కానీ అప్పటి ప్రభుత్వాలు అయన విడుదలకు ఎటువంటి ప్రయత్నాలూ చేయకపోవడం చాలా దారుణం.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...