ప్రతిభావంతులైన 82,000 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్పులు …. వెంటనే అప్లై చేసుకోండి

October 27, 2016

ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్పులు
**********************************
కాలేజీలు , యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు
సెంట్రల్ సెక్టార్ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్ లను అందిస్తోంది.

sch

ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుండి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేవారి వరకు ఈ స్కాలర్ షిప్పులు లభిస్తాయి.

ఏటా 82,000 స్కాలర్ షిప్పులు అందజేస్తారు. వీటిలో సగం అమ్మాయిలకు కేటాయిస్తారు.
CBSE , ICSE , స్టేట్ బోర్డుల పరిధిలో చదివే వారందరూ ఈ స్కాలర్ షిప్పులకు అర్హులు.

సైన్స్ , కామర్స్ , హ్యూమానిటీస్ విభాగాల విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
రెగ్యులర్ కోర్సులు చేస్తుండాలి. దూరవిద్యలో చదువుతున్నవారు అర్హులు కాదు.

విద్యార్థుల ఎంపికకు సీనియర్ సెకండరీ స్థాయిలో విద్యార్థులు సాధించిన మార్కులు ,
తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు.

స్కాలర్ షిప్ మొత్తం ::

ఇంటర్ మీడియట్ , డిగ్రీ స్థాయిలో నెలకు రూ. 1000/- చొప్పున ,
పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో రూ. 2000 /- చొప్పున ఇస్తారు.
ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు రూ . 2000 /- ఇస్తారు .

ప్రతి విద్యా సంవత్సరంలో పది నెలలు స్కాలర్ షిప్ లభిస్తుంది.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 31 .

ఇతర పూర్తి వివరాలకు ……. వెబ్ సైట్ : scholarships.gov.in

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...