ప్రకాష్ రాజ్ గారి జీవిత సంఘటన – ఆయనలో బాధ్యత మేల్కొన్న క్షణం

November 16, 2016

ప్రకాష్ రాజ్ గారి మాటల్లోనే……

నా కొడుకు చనిపోయాడు. వాడికి ఐదున్నరేండ్లు.
గాలిపటం ఎగరేస్తూ పడిపోయాడు.
హాస్పిటల్లో చేర్చాం. బెటర్ అయ్యాడనుకున్నాం.

prakash-raj

కానీ, ఆ దెబ్బవల్ల మెదడులో రక్తం క్లాట్ అయి చనిపోయాడు.

వాడు చనిపోతే నేను అసహాయుడినే అయ్యాను.

నా డబ్బు, పేరు -ఏదీ కూడా పదకొండేళ్ల ముందు నాకు అక్కరకు రాలేదు.

నాకే ఎందుకిలా అయిందని పుత్రశోకంతో కుమిలిపోయాను.

ఏం తప్పు చేశానని తీవ్ర విరక్తిలోకి వెళ్లాను.

ఆ సమయంలో వారం తర్వాతనుకుంటాను,
హిందూ పత్రికలో ఒక ఆర్టికల్ చదివాను.

లక్నోలో ఫ్రీగా బట్టలు ఇస్తున్నారని ఒక కుటుంబం వెళ్లింది.
తొక్కిసలాటలో 13 ఏండ్ల బాబు, 5 ఏండ్ల చెల్లెలు- చూస్తుండగానే ఆ పిల్లల అమ్మానాన్నలు చనిపోయారు.

ఆ పిల్లలు భోరున ఏడుస్తుంటే అప్పడర్థమైంది.
నాకే కాదు, వాళ్లకీ బాధ వుందని!
నాకంటే ఎక్కువే ఉందని!

నాకో కూతురుంది. నాకింకా జీవితం వుంది. వాళ్లకెవరున్నారు? అనిపించింది.

నాలో ఒక బాధ్యత మేల్కొన్న క్షణం అది.

You are rich with pain also అని! మనిషికి బాధ వుండాలి.

మనిషికి సఫరింగ్ వుండాలి. సాటి మనిషి సఫర్ అవుతుంటే కొంచెం సఫరింగ్ మనం తీసుకోవాలనిపించింది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...