పోస్టల్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు

October 6, 2016

పోస్టల్ డిపార్ట్ మెంట్ కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్యాంకుల్లో
రెండు వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇవన్నీ కూడా పీవో ఆపై స్థాయి పోస్టులే.

బ్యాంకుల్లోని ఖాళీలను ఐబిపిఎస్ భర్తీ చేస్తున్న విధంగానే , ఈ రిక్రూట్ మెంట్ ఉండనుంది.
“ ద ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ “ ( ఐఐబిపి ) పేరిట బ్యాంకులను
పోస్టల్ డిపార్ట్ మెంట్ ప్రత్యేకించి ఏర్పాటు చేసుకుంది.

postal-bank

కొత్తగా ఏర్పాటు చేస్తున్న 650 శాఖలకు గానూ దేశవ్యాప్తంగా 3500 ఖాళీలు ఉన్నాయి.
అయితే తాజా నోటిఫికేషన్ల ప్రకారం దాదాపుగా 2000 పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్కేల్ – 1 , స్కేల్ – 2 , స్కేల్ – 3 ఆఫీసర్ పోస్టులు పెద్ద సంఖ్యలో భర్తీ కానున్నాయి.
4 నుండి 7 వరకు కేడర్ పరిధిలో పైస్థాయి అధికారిక పోస్టులు ఉన్నాయి.
వాటికి విశేష అనుభవం అవసరం.

మొదటి మూడు పోస్టుల విషయానికి సంబంధించిన ఉద్యోగ ప్రకటన వివరాలు :

OFFICER GRADE – I
****************
పోస్టు : అసిస్టెంట్ మేనేజర్ ( టెరిటరీ ) ( జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్ – ఐ )
650 ఖాళీలు ఉన్నాయి. ఇందులో జనరల్ అభ్యర్థులకు 327 పోస్టులు కేటాయించారు. దాదాపుగా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

OFFICER GRADE – II
*******************
పోస్టు : అసిస్టెంట్ మేనేజర్ ( టెరిటరీ ) ( జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్ – ఐఐ )
652 ఖాళీలు ఉన్నాయి. ఏరియా సేల్స్ నుండి ఆపరేషన్స్ , ప్రోడక్ట్ రీసెర్చ్ , హెచ్ఆర్ తదితర పోస్టులు వేర్వేరుగా ఉన్నాయి.

OFFICER GRADE – III
********************
పోస్టు : అసిస్టెంట్ మేనేజర్ ( టెరిటరీ ) ( మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్ – ఐఐఐ )
408 ఖాళీలు ఉన్నాయి . వీటికి సంబంధిత అర్హతలకు తోడుగా ఆరేళ్ళ అనుభవం ఉండాలి.

ఇవిగాక స్కేల్ – IV నుండి స్కేల్ – VI కేటగిరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కూడా విడిగా ప్రకటనను విడుదల చేసారు. చీఫ్ మేనేజర్ , ఎజిఎం , డిజిఎం స్థాయిల్లో అవి ఉన్నాయి.

ఇతర వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను చూడండి.
వెబ్ సైట్ : www.indiapost.gov.in

5 Comments

on పోస్టల్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.
 1. RojaRamesh
  |

  Please give information about any other jobs thank you

 2. Ravi
  |

  Wonderful information

 3. sadhu
  |

  thank u

 4. Sreenivasnarisetty
  |

  Very good information like job Mela job guru for each and every job searching persons job bank
  THANK U

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...