పుదీనా ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందంటే…………

September 16, 2016

మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. ఇది పూర్గాతి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబంధవ్యాధులకి ఉపయోగిస్తారు.

పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి,
ప్రతి రోజూ 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది.

జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

pudina

కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.

నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, కొంచెం కొంచెంగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారా లు తగ్గుతాయి.

అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడు తుంది.

పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది.

చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూది ని ఆరసంలో ముంచి, ముక్కులోను, చెవి లోను డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది.

పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉపð చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు రాకుండా అరికడుతుంది.
అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.

ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు.

పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్య పరంగా వినియోగిస్తున్నారు.

చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది.

పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే. ఔషధతత్వాలు కలిగివున్నదే. ఇందులో క్రిమి సంహారక గుణాలు కూడా ఇందులో పుష్కళంగా ఉన్నాయి. సబ్బుల తయారీలో కూడా వాడుతున్నారు.

4 Comments

on పుదీనా ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందంటే………….
  1. S prakash Kumar
    |

    Very useful in our daily life

  2. M. James prabhakar
    |

    Very useful information thanks a lot….

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...