పుదీనాతో గొంతునొప్పితో పాటు మిగతా జబ్బులు ఎలా దూరమవుతాయంటే…..

October 12, 2016

పుదీనాను ఆహార పదార్థాలకు మంచి సువాసన ఇచ్చేందుకు మాత్రమే కాదు..
చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.

ఇటీవల పుదీనా టీ ఎంతో పాపులర్‌ అయ్యింది. పుదీనాను ఐస్‌ క్రీమ్‌, టూత్‌ పేస్టులలోనూ ఉపయోగిస్తారు. దీనికి కారణం ఇందులో ఉన్న ఔషధ గుణమే. పుదీనా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

ఆకు కూరల్లో పుదీనా ఆకుకు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి.
పలు రకాలైన రుగ్మతలకు పుదీనా మంచి మందు. అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

gonthu-noppi

పిత్తాశయం నుంచి వచ్చే జీర్ణరసాల ప్రభావం ఆహార పదార్థాలలోని కొవ్వుల మీద పనిచేసేలా ప్రేరేపిస్తుంది.

కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. గొంతు నొప్పికి ఇది దివ్వౌషధంగా పనిచేస్తుంది.

కళ్లెను కరిగించి, దగ్గు నుంచి ఉపశమనమిస్తుంది.

కీటకాలు కుట్టిన బాధ నుంచి పుదీనా రసం ఉపశమనాన్ని ఇస్తుంది.

చర్మంపై ఉన్న మచ్చలను తొలగించే శక్తి పుదీనాకు ఉంది.

అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.

గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా

తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి
నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలి పడితే సమస్య తీరుతుంది.

దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది.

ఎన్నో ఔషధగుణాలున్న పుదీనా ప్రతిఇంట్లో తప్పక ఉండాల్సిన మొక్క. ఇది చాలా తేలికగా పెరుగుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...