పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు , క్యాన్సర్లు రావు

October 7, 2016

పుట్టగొడుగులలో ఉన్న పోషక పదార్థాలు, ఔషధ గుణాల లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు. ఇవి మాంసాహారంతో సమానం. ఆహారప్రియులకు వర్షాకాలం స్పెషల్‌ పుట్టగొడుగులు.

mushrooms

వానాకాలంలో పుట్టలమీద మెులిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి.
పుట్టగొడుగులలో ఇర్గోథియోనైన్‌, సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

శరీరంలో యథేచ్చగా సంచరిస్తూ డి.ఎన్‌.ఎ.ను దెబ్బతీస్తూ,
గుండె జబ్బులకు, క్యాన్సర్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి ఎదుర్కొంటారుు.

పోర్టొబెల్లో, ్రెకమిని రకాల పుట్టగొడుగుల్లో ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయి.

కొన్ని రకాలు విటమిన్‌ ‘డి’ ఉత్పత్తికి సహకరించేవిగా పనిచేస్తారుు.

పుట్టగొడుగుల్లో 90శాతం నీరే ఉంటుంది. సోడియం ఉండదు.

పోటాసియం లభిస్తుంది, కొవ్వుపదార్ధం తక్కువ. ఫలితంగా బరువు పెరుగుతామన్న భయమే ఉండదు.

పుట్టగొడుగుల కణాల గోడలు అరగవు. పచ్చి పుట్టగొడుగులలోని పదార్థాలు జీర్ణరసాల్ని మందగింపజేస్తాయి.

శరీరం ప్రోటీన్‌లను గహించడాన్ని అడ్డుకుంటాయి. అందుకే ఉడికించి తినాలి.

పుట్టగొడుగులలో ఉండే కాపర్‌ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి
మెదడుకి, కండరాలకు, ఆక్సిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యం పెరుగుతుంది.

గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. డయాబిటీస్‌ను తగ్గిస్తుంది.

పచ్చి బఠాణీలతో కలిపి పుట్టగొడుగుల కూర వండుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది :

కావలసిన పదార్థాలు

ఉల్లిపాయ : 2, వెజిటబుల్‌ స్టాక్‌ : 2 స్పూన్‌, పచ్చి బఠాణీలు : కప్పు, పుట్టగొడుగుల ముక్కలు : కప్పు, పెరుగు : 1/2కప్పు, పాలు : 1/2 కప్పు, కొత్తిమీర : 1/4 కప్పు, జీడిపప్పు : 2, గసగసాలు : 2, ఉప్పు : రుచికి తగినంత, పచ్చిమిరప : 4, లవంగాలు : 2, వెల్లుల్లి : 1, యాలకులు : 2, అల్లం : స్పూన్‌.

తయారు చేయు విధానం :

స్టౌ వెలిగించి పాన్‌లో మధ్యస్థంగా వుండే మంటపై నూనె వేసి వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి, కలయబెడుతూ బాగా వేయించాలి. అందులో జీడిపప్పు, గసగసాలు, లవంగాలు, అల్లం వెల్లుల్లి కొత్తిమిర గ్రైన్డ్‌ చేసి పేస్ట్‌ ను రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పేస్టుని అందులో వేసుకోవాలి. బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు ఉడికించాలి. బాగా కలయబెడుతూఅవసరమైతే కొద్దిగా నీళ్ళు పోయాలి.

తర్వాత ఉడికే మసాలాలో అరకప్పు వెజిటబుల్‌ స్టాక్‌ పోసి, ఉడికించి, పక్కన పెట్టుకోవాలి. మరొక కుక్కర్లో బఠాణీల వేసి ఉడికించి పెట్టుకొని దీనికి ఉప్పు, మిగతా వెజిటబుల్‌ స్టాక్‌ కలుపుకోవాలి. ఉడకడం ప్రారంభమయిన తర్వాత రుబ్బిన పేస్టు వేసి బఠాణీలు మెత్తబడేదాకా ఉడికించాలి. పుట్టగొడుగులు ముక్కలు, పాలు, పెరుగు, కలిపి మరో 5 నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడికించాలి. అంతే పుట్టగొడుగు, పచ్చిబఠాని కూర రెడీ. దీన్ని కొత్తిమీరతో అలంకరించాలి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...