పుచ్చకాయ తింటే అందం పెరుగుతుందా……….

September 7, 2016

పుచ్చకాయవల్ల ఆరోగ్యంతో అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చుననే విషయం మీకు తెలుసా……?

పుచ్చకాయ వల్ల అందం, ఆరోగ్య లాభాలు రెండూ కలుగుతాయి.
ఆరోగ్య లాభాల గురించి తెలిసినంతగా దాని సౌందర్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు.

.WA

అవి ఏమిటంటే………….

* పుచ్చకాయ రసంలోని ఆమ్లాలను చర్మం మీద రాసుకుంటే చర్మం మీదవున్న వయసు మళ్లిన కణాలు రాలిపోతాయి. చర్మానికి మెరుపు వస్తుంది.

* పుచ్చరసంతో ముఖం కడుక్కుంటే ముఖం మీద ఉండే మచ్చల తొలగిపోతాయి.

* చర్మ సౌందర్యం కోసం పుచ్చకాయలు బాగా చల్లబరచి ఉపయోగించాలి. దీని వలన చర్మం మీదున్న జిడ్డుపోయి కాంతివంతంగా కనిపిస్తుంది.

* పుచ్చకాయల విత్తనాల నుండి తీసిన నూనె జిడ్డుగా ఉండదు. దీనిని శరీర మర్దనకు ఉపయోగిస్తారు. బేబీ ఆయిల్‌, ఫేస్‌క్రీమ్‌, హెయిర్‌ ఆయిల్‌్నగా కూడా దానిని వాడతారు.

* పుచ్చకాయ విత్తనాల నూనెలోని ఒమేగా 6, ఒమేగా 9 వంటి ఫ్యాటీ ఆమ్లాలు సులభంగా చర్మంలోకి వెళ్లి అక్కడి జిగట పదార్థాలను కరిగిస్తాయి.

* వేసవిలో చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. దీంతో బడలిక పెరుగుతుంది. ఏ కాస్త దూరం నడిచినా ఆయాసంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రయాణానికి ముందు, తరువాత ఓ పుచ్చముక్క తింటే రిలీఫ్‌గా ఉంటుంది. ఆవిరైన నీరు పుచ్చకాయ ద్వారా అందుతుంది.

* అనేక కారణాల వల్ల వేసవిలో పైత్యం వస్తుంది. కళ్లు తిరగ డం, వళ్లు తూలడం, వికారంగా ఉండటం పైత్యం లక్ష ణాలు. పుచ్చకాయ తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉం డవు.

* మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉన్నా, సరి గా విసర్జన కాకపోయినా పుచ్చకాయ తీసుకోవడం మం చిది. కిడ్నీల్లో రాళ్లు చేరకుండా, ఒకవేళ చేరినా కరిగించగల శక్తి పుచ్చకాయకు ఉంది.

* వేసవిలో ముఖం నల్లబడకుండా ఉండాలంటే పుచ్చకాయ గుజ్జు తీసి రాయాలి.

– ఆరోగ్యపు విలువలు ఏమిటంటే…………

* పుచ్చపండు వేడిని హరింపజేసి, శరీరాన్ని చల్లబరుస్తుంది.
దీనిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి స్థూలకాయులు సన్నబడడానికి ఉపకరిస్తుంది.

* వేసవిలో పెదవులు తడారిపోవడాన్ని తగ్గిస్తుంది.

* కడుపులోని మంటను, అల్సర్‌లను తగ్గిస్తుంది.

* అజీర్తిని తగ్గించి జీర్ణక్రియ సక్రమంగా అయ్యేలా చేస్తుంది.

* మూత్ర వ్యవస్థలోని లోపాలను సరిచేసి మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

* దీనిలో ఉన్న పీచుపదార్థం చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

* జ్యూస్‌లు, సలాడ్లు ఇలా పుచ్చపండును ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే చర్మం నిగనిగలాడుతుంది.

* పుచ్చకాయ గుజ్జును ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే ముఖం మీద ఉన్న జిడ్డు తొలి కాంతివంతంగా తయారవుతుంది.

* రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

* గుండె పటిష్టతకు తోడ్పడుతుంది.

* రక్తప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

* వేసవి తాపాన్ని, దాహాన్ని నివారిస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...