పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకెళ్ళిన భారత ఆర్మీ

September 29, 2016

భారత ఆర్మీ వీరోచిత ఆపరేషన్
**********************

పాకిస్తాన్ ప్రోద్భలంతో తీవ్రవాదులు చేస్తున్న మారణహోమానికి చరమగీతం పాడాలని సంకల్పించిన
భారత ఆర్మీ రంగంలోకి దిగింది.

ar1

అర్ధరాత్రి 12:30 గంటలకు సర్జికల్ స్త్రైక్స్ అనే స్పెషల్ ఆపరేషన్ ద్వారా ప్రత్యేక ఆర్మీ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకెళ్ళి తీవ్రవాద శిబిరాల మీద దాడులు చేసాయి.

దాదాపుగా రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళి , 7 తీవ్రవాద శిబిరాలపై ఎనిమిది సార్లు దాడులు చేసాయి.

తీవ్రవాద శిబిరాలను భస్మీపటలం చేసి , అక్కడున్న తీవ్రవాదులందరినీ మట్టుబెట్టాయి. అదే సమయంలో తీవ్రవాదులకు సపోర్టు గా వచ్చిన పాక్ ఆర్మీ వారిని కూడా అంతు చూశాయి. పాక్ వైపున భారీగా ప్రాణ నష్టం జరిగింది.

సుమారుగా 4 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లో ఒక్క భారత సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదు.

ఈ మొత్తం స్పెషల్ ఆపరేషన్ అజిత్ దోవల్ గారి పర్యవేక్షణలో జరిగింది.

విజయవంతమైన ఈ స్పెషల్ ఆపరేషన్ పట్ల యావత్ భారతావని,” జై జవాన్ “, ” జయహో భారత్ ” అని ముక్త కంటంతో నినదిస్తోంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...