పాకిస్తాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ భారత ఆర్మీ

November 23, 2016

భారత సైనికులను చంపి శిరచ్ఛేదనం చేస్తూ…..
వికృత పైశాచికానందం పొందుతున్న పాకిస్తాన్ సేనలకు భారత ఆర్మీ గట్టి జవాబిచ్చింది.

పాకిస్తాన్ సైనిక స్థావరాలపై మోర్టార్లను ప్రయోగిస్తూ భారీ ప్రతీకార దాడులకు శ్రీకారం చుట్టింది.

పాక్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండడంతో…
పూంచ్, రాజౌరీ, కెల్, మాచిల్ తదితర సెక్టార్లలో
భారత సైన్యం పాకిస్తానీ ఔట్‌పోస్టులపై భీకర దాడులు జరుపుతూ, సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తోంది.

armyyy

బుధవారం కూడా కాశ్మీర్‌లోని భీబెర్ గాలి, కృష్ణఘాటి, నౌషిరా తదితర ప్రాంతాల్లో
పాకిస్తాన్ కాల్పులకు తెగబడినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

మంగళవారం పాక్ సైన్యం అండతో ఉగ్రవాదులు రెచ్చిపోయి ఇద్దరు భారత జవాన్లను చంపేశారు.
ఓ సైనికుడి తలను నరికేశారు.

జనీవా ఒప్పందం ప్రకారం శిరచ్ఛేదనం చేయడం నిషేధం.

‘‘సైనికులను శిరచ్ఛేదనం చేసి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న
పాకిస్తాన్‌ తగిన ప్రతికారం అనుభవించక తప్పదు’’ అని భారత ఆర్మీ హెచ్చరించిన సంగతి తెలిసిందే…

గతనెల 28న కూడా ఇలాగే ఓ భారత జవానును శిరచ్ఛేదనం చేయడంతో…
అందుకు ప్రతిగా భారత సేనలు నాలుగు పాకిస్తాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...