పాకిస్తాన్ ను సర్వ నాశనం చేయండి – అమర జవాన్ భార్య ప్రధానికి విజ్ఞప్తి

October 30, 2016

శుక్రవారం రాత్రి ………….. జమ్మూ కాశ్మీర్ లోని మచ్చిలి సెక్టార్ ……….
భారత జవాను మన్ దీప్ సింగ్ నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్నాడు.

బాగా పొద్దుపోయిన తర్వాత కొందరు ఉగ్రవాదులు ఒక్కసారిగా చొరబాటుకు ప్రయత్నించారు.
దానిని చూసిన మన్ దీప్ సింగ్ వారితో పోరాటం చేసాడు.

ఆ నీచుల కుట్రను భగ్నం చేసే క్రమంలో మన్ దీప్ సింగ్ వీర మరణం పొందాడు.

201-copy

అణువణువునా పైశాచికత్వం నిండిన ఆ తీవ్రవాదులు ,
మన్ దీప్ సింగ్ శరీరాన్ని అనేక ముక్కలుగా ఖండించి తమ కర్కశత్వాన్ని చూపారు.

తీవ్రవాదుల యొక్క ఈ దుర్మార్గపు చర్యతో దేశవ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది.

శనివారం సాయంత్రం మన్ దీప్ ఖండిత శరీర భాగాలను హర్యానాలోని ఆయన స్వగ్రామం అనంతెహ్రీ కి తీసుకొచ్చారు. అమర జవానుకు నివాళులు అర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

మన్ దీప్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ
తీవ్ర భావోద్రేకాలకు లోనయ్యారు.

“ పాకిస్తాన్ ను దాని హద్దుల్లో ఉంచగలిగితే ఉంచండి ……….
లేకపోతే సమూలంగా నాశనం చేసి , తుడిచిపెట్టేయండి “ అని మన్ దీప్ సతీమణి అయిన ప్రేరణ
ప్రధానిని ఏడుస్తూ డిమాండ్ చేసారు.

పాక్ దుశ్చర్యల కారణంగా మరో జవాను ఇంట ఇలా విషాదం నిండకూడదని ……
వాళ్ళ జీవితాలలో చీకట్లు ముసరకూడదని ఆమె ఉద్విగ్నంగా విజ్ఞప్తి చేసారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...