పాకిస్తాన్ కు షాక్ ఇవ్వనున్న ట్రంప్ – భారతీయులందరికీ తీపి శుభవార్త

November 17, 2016

యావత్ భారతీయులందరూ అత్యంత ఆనందించే విషయం ఇది. మన దేశాన్ని నాశనం చేయాలని అనుక్షణం తపిస్తోన్న పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలే రోజులు దగ్గరపడ్డాయి. ఇది మన భారతీయులందరికీ అత్యంత తీపి శుభవార్త.

trump

వివరాల్లోకి వెళితే…….

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపొందిన అనంతరం
మొదటిసారిగా భారతదేశానికి ఓ తీపి వార్త వినిపించింది.

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలనే భారతదేశ డిమాండ్ త్వరలోనే నిజం కాబోతోంది.

భారతీయ మూలాలున్న ప్రముఖ వ్యాపారవేత్త, ట్రంప్ సలహాదారుల కౌన్సిల్‌లోని కీలకమైన వ్యక్తి
షలబ్ కుమార్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే బిల్లును ట్రంప్ ఆధ్వర్యంలో త్వరలోనే ఆమోదించనున్నామని
ఆయన తెలిపారు. అమెరికన్ కాంగ్రెస్‌‌కి సెప్టెంబర్ నెలలో చేరిన బిల్లును ట్రంప్ అడుగుపెట్టిన తొలిరోజులలోనే ఆమోదించనున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ, ట్రంప్‌ల కలయికతో భారత్, అమెరికా మధ్యసంబంధం
బలపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని,
చరిత్రలో ఇదివరకెన్నడూ చూడనివిధంగా రెండు దేశాల బంధాలు బలపడుతాయని
ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా ప్రకటిస్తే
పాకిస్థాన్‌కు సహాయ నిధులు ప్రవాహం తగ్గుతుంది.

దీంతో పాకిస్థాన్ ఆర్థికంగా బలహీనపడడం ఖాయంగా కనిపిస్తోంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...