పది లక్షల మంది యువతకు ఆయన మార్గదర్శకుడు ఎందుకు అయ్యారంటే…..

November 24, 2016

మన భరతభూమి ఎందరో నిస్స్వార్థ సేవాతత్పరులైన బిడ్డలను కన్న పవిత్ర భూమి.

ఈ పుణ్య భూమిలో పుట్టిన ముద్దు బిడ్డలలో అసాధారణ ప్రతిభావంతుడైన శంభాజీ భిడే కూడా ఒకరు.
వీరిది మహారాష్ట్ర.

shambhajee1

కాళ్ళకు చెప్పులైనా వేసుకోకుండా ఎంత దూరమైనా ప్రయాణం చేసే
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే మహా మనీషి ఈయన.

ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రక్కన నిలబడి
అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఈయన సాధారణ వ్యక్తి కాదు.

shambhajee2

MSc అటామిక్ పిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఈయన.
పూణే లోని పర్గూన్స్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ
న్యూక్లియర్ పిజిక్స్ ను చాలా సంవత్సరాల పాటు బోధించారు.

ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసి ,
మహారాష్ట్రలో విస్తృతంగా నిర్వహిస్తూ పది లక్షల మందికి పైగా యువతరం
తనతో పాటు సేవలలో పాల్గొనేలా చేస్తున్నారు.

కాలి నడకకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే ఆయన ,
కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంత దూరమైనా నడుస్తారు.

తెల్లటి ఖాదీ వస్త్రాలు మాత్రమే ధరిస్తూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నారు.
వారి వ్యక్తిత్వం , ఆలోచనా విధానాం అత్యంత అనుసరణీయమైనవి.

shambhaajee

“ మనం పవిత్రమైన ఈ దేశంలో పుట్టాం.
ఈ గాలిని పీలుస్తూ
ఈ నీటిని తాగుతూ
ఈ నేలపై నడుస్తున్నాం.
మన ఊపిరి ఉన్నంతవరకు ఈ దేశానికి ఏదో విధంగా సేవ చేయడం మనందరి బాధ్యత “
అనే ఉన్నతమైన ఆశయంతో ఆయన ముందుకు పయనిస్తున్నారు.

అలాంటి గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకోవడం, ఈ ప్రపంచానికి తెలియజేయడం,
వారిని అనుసరించడం మనందరి బాధ్యత

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...