పచ్చళ్ళు రాత్రి పూట ఎందుకు తినకూడదంటే………….

October 12, 2016

రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటుగా ఉంటుంది.

అయితే రాత్రి వేళ చేసే భోజనంతోపాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు.
ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది.

pachhallu

ఎందుకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది.
నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవుట వలన
పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.

పత్యం శతగుణం ప్రోక్తం అన్నారు కనుక సర్వ వైద్యములకు పథ్యము చేయడం మిక్కిలి శ్రేయస్కరము.

అంతేకాదు.. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు.

పక్షవాతానికి విరుగుడు జీడిపప్పు:

మన శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి.
ఇది సుమారు 300 రకాల జీవ రసాయనిక చర్యల్లో పాలు పంచుకుంటుంది.
ఇది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో దీన్ని బట్టే అర్థమవుతుంది.
మన శరీరంలోని మెగ్నీషియంలో సగం వరకు ఎముకల్లోనే ఉంటుంది. మిగతాది కణాల లోపల, కణజాలంలో, అవయవాల్లో ఉంటాయి. కండరాలు, వాడుల పనితీరు సక్రమంగా జరగాలంటే
ఈ మెగ్నీషియం ఎక్కువగా తోడ్పడుతుంది.

ఇది పక్షవాతం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.

మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారిలో
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టం ద్వారా వచ్చే పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియంలో అదనంగా 100 మిల్లీగ్రాముల మోతాదు పెరుగుతున్నకొద్దీ
పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్టు కనుగొన్నారు.

పొట్టు తీయని ధాన్యాలు.. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరగాయలు (బీన్‌‌స), బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

కప్పు బీన్‌‌స లేదా ముడి బియ్యం, 30 గ్రాముల బాదం లేదా జీడిపప్పు, కప్పు ఉడికించిన పాలకూర తింటే సుమారు 100 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకూ దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినటం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...