పంటి నొప్పిని వెంటనే తగ్గించుకునే వైద్య మార్గాలు

October 4, 2016

పంటినొప్పిని తగ్గించుకునే మార్గాలు :

యాంటీ సెప్టిక్ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉండే ఉల్లిపాయ పంటి నొప్పిని తగ్గిస్తుంది. పచ్చి ఉల్లిపాయను కొన్ని నిమిషాల పాటూ నమలటం వలన నోట్లో ఇన్ఫెక్షన్ లకు కారణమైన కారకాలను తొలగించి, పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నోట్లో నుండి వచ్చే వాసన లేదా చిగుళ్ళ సమస్యల నుండి ఉపశమనం పొందుటకు, పచ్చి ఉల్లిపాయ ముక్కలను నోట్లో చప్పరించవచ్చు .

యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే వెల్లుల్లి, నోట్లో ఉండే బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తుంది. వెల్లుల్లి పొడిని మరియు పచ్చి వెల్లుల్లి దిబ్బలను దంతాలకు అప్లై చేయటం వలన పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

tooth-ache

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, అనస్తెటిక్ గుణాలను కలిగి ఉండే లవంగాలు పంటి నొప్పిని తగ్గించే ఉత్తమ ఇంట్లో ఉండే ఔషదంగా తెలుపవచ్చు. కాటన్ సహాయంతో లవంగాల నూనెను నేరుగా ప్రభావిత ప్రాంతంలో ఆపాదించటం వలన పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

చల్లని మంచు గడ్డను నొప్పిగా ఉండే దంతాలపై ఉంచటం వలన నొప్పి తగ్గుతుంది. లేదా ఐస్ ఉన్న చిన్న ప్యాకెట్ ను తీసుకొని, నొప్పిగా ఉండే ప్రాంతంలో ఉంచవచ్చు. ఇలా మంచు గడ్డలను ఉంచటం వలన నొప్పి ఉండే ప్రాంతం చుట్టూ ఉష్ణోగ్రతలు తగ్గటం ద్వారా నొప్పి తెలియదు.

పంటి నొప్పి నుండి ఉపశమనం అందించే సహజ ఔషదంగా గోరు వెచ్చని నీటిని పేర్కొనవచ్చు. ఒక గ్లాసు వేడి నీటిని ఒక చెంచా ఉప్పు కలపటం ద్వారా మౌత్ వాష్ ను తయారు చేసిన వారవుతారు. ఈ మిశ్రమం ద్వారా నోటిలో ఉండే బ్యాక్టీరియా చంపి మరియు వాటి దంతాల మధ్య ఉండే అనవసర ద్రావణాలను తొలగిస్తాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...