నీతి , నిజాయితీలే తన శ్వాసగా బ్రతుకుతున్న ఓ ఆఫీసర్

September 22, 2016

ఒక అబ్బాయి చిన్నతనంలో మామిడి తోటలో రాలిపడిన పళ్ళను ఇంటికి తీసుకెళితే ,
అతని అమ్మ ఆ పళ్ళను బయటకు విసిరేసి,
నీ సొంతం అనుకున్న వాటితోనే ఆనందంగా ఉండు, పరులది ఆశించకు అని చెప్పింది.

ఆనాటి నుండి నేటి వరకు తన అమ్మ మాటకు కట్టుబడి,
నిజాయితీయే తన ప్రాణంగా జీవిస్తున్నాడు ఓ ఐఏస్ ఆఫీసర్.

sagayam-ias

అతనే యు.సగాయం.తమిళనాడులోని మదురై జిల్లా కలెక్టర్.

ఇరవైయేళ్ళ సర్వీస్ లో పద్దెనిమిది సార్లు ట్రాన్స్ ఫర్లు …….
ఇది చాలు ఆయన ఎంత నిజాయితీగా తన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నాడో………..

నమక్కల్ లో కలెక్టర్ గా ఉన్నప్పడు తన ఆస్తులను ప్రకటించారు. ఈ పని చేసిన తొలి ఐఏస్ ఆయనే.

తన పేరిట 7,172 రూ.ల.నగదు, మదురైలో 9 లక్షల విలువైన ఇల్లు ……….ఇవే ఆయన ఆస్తులు.

కోయంబత్తూర్ లో డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తున్నప్పుడు
తన కూతురు తీవ్ర శ్వాస కోశ సమస్యతో బాధ పడుతూ ఉంటే ,
సమయానికి ఆ పాపను ఆసుపత్రిలో చేర్చేందుకు అతని దగ్గర డబ్బు లేదంటే………..
అతను ఎంతటి నిజాయితీ పరుడో మనకు అర్థమవుతుంది.

కాంచీపురంలో పని చేస్తున్నప్పుడు ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపడమే గాక,
ఒక శీతల పానీయంలో కలుషిత పదార్థాలున్నాయని , ఆ పానీయాన్ని నగరంలో నిషేధించేలా చేసారు.

మదురై జిల్లాలో జరిగిన వేలాది కోట్ల గ్రానైట్ స్కాం లో భాగంగా నరబలులు జరిగాయని నిరూపించేందుకు సాక్ష్యాలు ఎవరూ తారు మారు చేయకుండా మేళూరులోని స్మశానంలో నిద్రించి ,
ఒక బాలిక ఇద్దరు బాలుర శవాలతో పాటు నరబలికి వాడిన వస్తువులు బయటికి వచ్చేంత వరకు
అక్కడే ఉండి, నరబలులు జరిగాయని నిరూపించారు.

సగాయం గారి తలుపుపై “ లంచాలను తిరస్కరించు, తలెత్తుకొని నిలబడు” అనే నినాదం రాసి ఉంటుంది.
నేడు మన దేశానికి కావలసింది ఇలాంటి అధికారులే, అతని నిజాయితీని అందరికీ తెలియజేసి, హ్యాట్సాఫ్ చెప్పండి.

2 Comments

on నీతి , నిజాయితీలే తన శ్వాసగా బ్రతుకుతున్న ఓ ఆఫీసర్.
  1. P VIJAY BHASKAR
    |

    Your articles was recently i saw, wonderful information’s on your posts. (I am working a typist in APPCB, HYD.)

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...