నిజాయితీకి నిలువుటద్దం ఈ IAS ఆఫీసర్

October 29, 2016

ఆకురాతి పల్లవి…………
ఈ పేరు వింటే చాలు , కర్ణాటక లోని అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతాయి.

శ్రమ , పట్టుదల , అంకితభావం , నిజాయితీ , నిబద్దత కు మారుపేరుగా నిలుస్తున్న
ఈ IAS ఆఫీసర్ మన తెలుగు బిడ్డ అయినందుకు మనందరికీ ఎంతో గర్వకారణం.

pallavi-ias

6 ఏళ్లు…….. 9 బదిలీలు ……………… ఇది చాలు ………
ఆమె కెరీర్ లో ఎంత నిజాయితీగా ఉందో చెప్పడానికి.

అవినీతి నేతలకు , మాఫియాకు ముచ్చెమటలు పట్టిస్తూ ప్రజల మనసులను గెలుచుకుంది.

చాలా సాదాసీదాగా కనిపించే పల్లవి గారి సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు.
ఆమె తండ్రి ఒక సాధారణ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి , తల్లి గృహిణి.
ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న పల్లవి గారు , ఆంధ్రా యూనివర్సిటీ నుండి పీజీ చేసారు.
చదువు కోసం పడ్డ కష్టంతో , నిజాయితీకి విలువనిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కర్ణాటకలో జరిగే ఇంటర్ పరీక్షల్లో పేపర్ల లీకేజీ అనేది మాఫియా చేతుల్లో ఉండేది.
అలాంటి మాఫియా ఆట కట్టించి , పరీక్షలు సజావుగా జరిగేలా చేసింది.
లీకేజీ మాఫియా నుండి హత్యా బెదిరింపులు వచ్చినప్పటికీ ఏమాత్రం భయపడకుండా……….. మాఫియా సూత్రదారులందరినీ కటకటాల వెనక్కి నెట్టింది.

ఎండోమెంట్ కమీషనర్ గా ఉన్నప్పుడు రాజకీయ నేతలు ఆక్రమించుకున్న
600 కోట్ల విలువైన భూములను , భవనాలను విడిపించింది.
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా ……..
బెంగుళూరు నగరం నడిబొడ్డులో ఉన్న అనేక ఆక్రమణలకు విముక్తి కల్పించింది.

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఒక పేద మహిళకు న్యాయం చేయడం కోసం
ఒక బడా రాజకీయ నేతతో యుద్ధమే చేసారు.
ఆ రాజకీయ నాయకుడు తన ప్రాబల్యాన్నంతా ఉపయోగించి పల్లవి గారిని ట్రాన్స్ ఫర్ చేసారు.
కానీ ఆ పేద మహిళకు న్యాయం చేసాకే ఆమె అక్కడి నుండి వెళ్ళారు.

అదీ పల్లవి గారికి తన విధి నిర్వహణ పట్ల ఉన్న నిబద్ధత.

ఇలాంటి అధికారులు చాలా అరుదుగా ఉంటారు.
నిజాయితీతో కూడిన ఇటువంటి IAS ఆఫీసర్ల గురించి ఈ ప్రపంచానికి సగర్వంగా తెలియజేయండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...