నడుము నొప్పి నివారణకు చక్కగా పని చేసే ఇంటి వైద్యాలు

November 20, 2016

పనిభారం వల్ల గానీ లేక నెలసరి సమయంలోనో నడుము నొప్పి రాని మహిళలు దాదాపు ఎవరూ ఉండరు. ఈ నొప్పిని తగ్గించడానికి ఏదో ఆయింట్‌మెంట్ లేక నొప్పి తగ్గించే జెల్ వంటివి వాడుతుంటారు కానీ ఇవి తాత్కలికంగానే ఉపశమనాన్ని అందిస్తాయి.

నడుము నొప్పి నుంచి పూర్తి ఉపశమనం కావాలంటే కొన్ని చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటూ
ఇంట్లో దొరికే సామాగ్రితో చిన్న చిన్న చిట్కాలు కూడా పాటిస్తే సరి.

hnadumu

* వంద గ్రాముల గసగసాలను పొడి చేసుకొని పెట్టుకొని రెండు చెంచాల పొడిని
గ్లాసు పాలలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తగాడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

* చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని రెండు కప్పుల నీళ్ళలో వేసి అవి ఒక కప్పు అయ్యే వరకు
మరిగించాలి. ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత దీనిలో తేనే కలుపుకొని తాగితే నడుము నొప్పి
తగ్గిపోతుంది. అల్లం పెస్ట్‌ను నొప్పి ఉన్న చోట కాసేపు పెట్టి కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
అల్లంలోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గడానికి దోహదం చేస్తాయి.

*నడుము నొప్పిగా ఉన్న భాగంలో ఐస్‌తో కాపడం పెట్టుకోవడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది.
అయితే నొప్పి పూర్తిగా తగ్గే వరకు ప్రతి అరగంటకోసారి ఇలా చేస్తుండాలి.

*తులసి ఆకులను ఒక కప్పు నీటిలో వేసి అవి అరకప్పు అయ్యే వరకు మరిగించి
ఆ నీటిలో ఉప్పు వేసుకొని తాగితే నొప్పి తగ్గు ముఖం పడుతుంది.

*తెల్లచామంతితో చేసిన కషాయం కూడా నడుము నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది.

*ఒక కప్పు పాలలో రోజు తేనె వేసుకొని రోజు తాగడం వల్ల కూడా నడుము నొప్పి రాకుండా ఉంటుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...