దేవుని దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చోవాలంటే ……….

November 26, 2016

దేవాలయం అనేది పరమ పవిత్ర ప్రదేశం.

ఆలయంలో నిత్యం శ్లోకాలు, ఘంటానాదాలు, భక్తుల ప్రార్థనలు, పురోహితుల వేదమంత్రాలు వినవస్తుంటాయి.

భగవంతుని దర్శనం పూర్తికాగానే……..
ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవాలి.
ఇది మన సంప్రదాయం.

gdi

మనం అనేక సమస్యలతో సతమతమవుతుంటాం.
మానసిక ప్రశాంతత కోసం భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత
కాసేపు కూర్చొని భగవంతుని ఆరాధన గానీ ప్రసాదం స్వీకరణ గానీ చేయాలి.

ఆ సమయంలో మన మనస్సులో ఆ దివ్యమంగళ స్వరూపమే దర్శనమిస్తుంటుంది.
స్వామివారిని చూసిన అలౌకిక ఆనందం మిగులుతుంది.

మనసు ఇతర అంశాలపైకి వెళ్లకుండా దైవంపైనే కేంద్రీకరిస్తుంది.
అందుకనే భగవంతుని దర్శనం చేసుకున్న అనంతరం కాసేపు గుడిలో కూర్చోవాలి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...