దేవుడికి కర్పూరంతోనే హారతి ఎందుకు ఇస్తారంటే…………

October 27, 2016

దేవుడికి కర్పూరం తోనే హారతి ఎందుకు ఇస్తారంటే………..

సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం.

karpoora-harati

ఎందుకంటే…….
కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్చంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్ళకు మంచిది. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.

కర్పూరం అతి దాహం, ముఖ శోష లాంటి అనారోగ్యాలను నివారిస్తుంది.
మంటలు, దురదలు లాంటి చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది.
వాత, పిత్తాలను హరిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
గొంతు పూడుకుపోవడం, స్వరపేటికలో ఉండే దోషాలను నివారిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పొతే, కర్పూరం వల్ల అసంఖ్యాకమైన ఉపయోగాలు ఉన్నాయి.

ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది.
మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది కర్పూరం.

కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి. హిమ కర్పూరం, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం,
చీనా కర్పూరం, పచ్చ కర్పూరం మొదలైనవి ముఖ్యమైనవి.
ఇన్ని ఔషధ గుణాలు కలది, అద్భుతమైంది కనుకనే కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...