దానిమ్మ పండుతో గుండెజబ్బులకు చెక్ పెట్టండిలా………..

October 29, 2016

ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి పండులోనూ ఎన్నో ఔషధగుణాలుంటాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ పండు ఏ జబ్బుకు ఎలాఉపయోగపడుతుందో మనలో చాలామందికి తెలియదు.

ఆ ఆరోగ్య విషయాలు చెప్పడానికి అనేక పరిశోధనలు చేపట్టి సలహాలనందిస్తున్నారు ఎందరో వైద్య నిపుణులు.

గుండె జబ్బులతో బాధపడే వాళ్లకు దానిమ్మ ఎంతగానో ఉపయుక్తమైనదని పరిశోధకులు తేల్చారు. గుండెపోటు వంటి తీవ్ర సమస్యలకు కూడా దానిమ్మ ఎంతో అడ్డుకట్టవేస్తుందని తేల్చారు. అంతేకాకుండా దానిమ్మ పండు గింజలను అరకప్పు తీసుకుంటూ ఉండటం వల్ల చెడు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని, అందువల్ల ఊబకాయాన్ని కూడా నియంత్రించి , హృద్రోగ సమస్యలను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ghrt

అంతేగాక దానిమ్మ పండ్లను ప్రతిరోజూ తీసుకుంటే క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే దానిమ్మ పండు రోజూ అరకప్పు తీసుకుంటే మంచి ఫలితముంటుందని వారు చెబుతున్నారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దానిమ్మలో పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి.

శరీరానికి కావాల్సిన విటమిన్‌ ఎ, సి, ఈలను ఇది అందజేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సమస్యలకు దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది.

రక్తపస్రరణ సక్రమంగా సాగడం కోసం దానిమ్మను తీసుకోవాలి.

గొంతునొప్పికి దానిమ్మ చాలా బాగా పనిచేస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...