థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు , ఏవి తినాలి …..? ఏవి తినకూడదు …..?

November 11, 2016

విపరీతమైన ఆందోళన, చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, కీళ్లు.. కండరాలు పట్టేసినట్టు ఉండటం, బరువు పెరిగిపోవడం, నెలసరి సమయంలో అధిక రోజులు రక్తస్రావం..
ఇవన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు.

థైరాక్సిన్‌ హార్మోన్‌ తక్కువ విడుదలవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

గర్భం ధరించాలనుకొనే మహిళలు ముందుగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి.
నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

c1

పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది. అలాగే అయొడిన్‌ తగు మోతాదులో ఉండే ఉప్పుని రోజూ అందేట్లు చూసుకోవాలి. శుద్ధిచేసిన ఆహార పదార్థాలకి బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి.

ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి. ఇక శక్తిని పుంజుకోవడానికి నిత్యం పండ్లు, తాజా కాయగూరలు అధికంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, చేపలు, మాంసం ఇవి మేలు రకం మాంసకృత్తులని అందిస్తాయి.

కొద్దికొద్దిగా.. ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం :

క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ, పాలకూర, పియర్స్‌, స్ట్రాబెర్రీలు.. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ స్థాయులని మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే పచ్చి వేరుసెనగలకీ దూరంగా ఉండాలి.

ఉడకబెట్టినా, వండినా వాటి కొంత ప్రభావం తగ్గుతుంది. సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి.

వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది.
ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి.

నీళ్లు అధికంగా తాగాలి. హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకొన్నట్టయితే సమస్యని పక్కకు నెట్టి హాయిగా ఉండొచ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...