తొమ్మిదికి పైగా దేవతా మూర్తుల విగ్రహాలు ఒకే చోట కొలువైన క్షేత్రం

October 13, 2016

ఆధ్యాత్మిక సౌరభాల శ్రీ నారాయణాశ్రమం – గో సంరక్షణ కేంద్రం
*********************************************
మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలలో
పురాతన కాలం నుండి ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ ,
మన సనాతన భారతీయ ధర్మాన్ని పరిరక్షించే సదుద్దేశ్యంతో ఆశ్రమాలనిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

ఆనాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు ఆశ్రమాలను నెలకొల్పి
దేవతా మూర్తులకు పూజలు చేస్తూ,
లోక కల్యాణం కోసం యజ్ఞాలను గావిస్తూ ,
మూగ జీవాల పరిరక్షణకు గోశాలలను నిర్వహిస్తూ వస్తున్నారు.

అటువంటి ఆశ్రమాలలో ఒకటే, శ్రీ సద్గురు సమర్థ నారాయణ మహారాజుల వారి ఆశ్రమం.

001_twitterface

ఆశ్రమం విశిష్టత ఏమిటంటే………….

శ్రీ ఛత్రపతి శివాజీ చక్రవర్తి గారికి గురువు గారైన శ్రీ సమర్థ రామదాస స్వామి పరంపరలో
11 వ పీఠాధిపతియగు శ్రీ సద్గురు సమర్థ నారాయణ మహారాజుల గారు నెలకొల్పబడిన ఆశ్రమం.

ప్రస్తుతం ఆయన శిష్యుడైన శ్రీ గోపాల స్వామి గారి ఆధ్వర్యంలో ఆశ్రమం నడపబడుతోంది.

కలియుగంలో నామ సంకీర్తనమే దైవ కృపకు మార్గమని అనేక బృంద భజన కార్యక్రమములు ,
రామ సప్తాహములు జరుపుతున్నారు.

నిరంతర అన్నదాన కార్యక్రమములు చేస్తూ ,
ఋషి సంప్రదాయమైన గో పూజ , గో సేవ చేయడంతో పాటు
దేశ క్షేమమునకై యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నారు.

ఈ ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం , కామధేనువు ఆలయం , శివాలయము,
శ్రీ లక్ష్మి , గణపతి ఆలయము , ఆదిత్యాది నవగ్రహముల ఆలయము , శ్రీ కృష్ణ మందిరము ,
మారుతి దేవాలయము , శ్రీ సరస్వతీ మాత, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయములు ఉన్నవి.

ఆశ్రమంలో ఉన్న బిల్వ వృక్ష , మామిడి వనము , రుద్రాక్ష మొదలగు దేవతా వృక్షాల మధ్యలో
సాధన గణపతి వారిని , సిద్ధి గణపతుల వారిని , కాశీ నుండి తెప్పించబడిన ముక్తేశ్వర స్వామి , నందీశ్వరున్ని , కాశీ విశాలాక్షి అమ్మవారిని మరియు నాగ పంచాయతనము విగ్రహములు ప్రతిష్టించబడినవి.

ఇక్కడ ఉన్న ఆలయాలలోని ప్రత్యేకత ఏమిటంటే , కాశీ క్షేత్రం నుండి తెచ్చిన శివ లింగ దర్శనం కోసం వచ్చే భక్తులు తామే స్వయంగా అభిషేకము , పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు. అందువల్ల భక్తులు ఎంతో భక్తి పారవశ్యంతో దేవతా విగ్రహాలను స్పర్శిస్తూ ,పూజలు చేస్తూ తన్మయత్వం పొందుతున్నారు.

ఇక్కడ ఉన్న విగ్రహ మూర్తులకు స్వయంగా పూజలు చేసి, ప్రసాదం స్వీకరిస్తే తమకు ,
తమ కుటుంబాలకు ఎంతో మంచి జరుగుతుందని , ఆయురారోగ్యాలతో ,
అష్టైశ్వర్యాలతో విలసిల్లుతామని భక్తులు ప్రగాడంగా విశ్వసిస్తున్నారు.

ఇక్కడ విచ్చేయు భక్తులకు నిత్యాన్నదానం తో పాటు , వసతి గృహములను కూడా ఏర్పరిచియున్నారు.

తొమ్మిదికి పైగా దేవతా మూర్తులు కొలువై ఉన్న ఈ ఆశ్రమాన్ని ఒక్కసారి సందర్శించండి –
భగవంతుని కృపకు పాత్రులు కండి.

ఆశ్రమం నిర్వాహకులు : శ్రీ గోపాల స్వామి గారు

ఆశ్రమం మరియు గోశాల చిరునామా :

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణానికి 6 km దూరంలోని ఉప్పర పల్లె అనే గ్రామంలో ఉంది.

ఆశ్రమం వారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ :

నారాయణాశ్రమం , ఉప్పరపల్లె క్షేత్రము : 98495 09981 , 88972 55658

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...