తేనె + వెల్లుల్లి ని ఇలా చేసి త్రాగితే ……. లంగ్స్ జబ్బులన్నీ మాయం

November 15, 2016

ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వంటల్లో ఎక్కువగా ఉపయోగించే ‘వెల్లుల్లి’ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అదేవిధంగా ‘తేనె’ లో యాంటీ మైక్రోబియల్ లక్షణంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే, ఇతర అనారోగ్యాలను తొలగించే ధర్మాలు ఉంటాయి.

అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆ మిశ్రమం శ్వాసకోశ సమస్యలకు చక్కని మందుగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘వెల్లుల్లి-తేనె’ సిరప్‌ను ఏ విధంగా తయారు చేయాలో, దాని వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో ఇది చదివి తెలుసుకోండి.

1vellulli

సిరప్ తయారు చేసే విధానం…

పొడిగా ఉన్న చిన్న జార్ లాంటి ఒక పాత్రను తీసుకోవాలి.
తర్వాత కొన్ని వెల్లుల్లి పాయలను తీసుకొని , వాటి పొట్టును తీసేయాలి.
అలా పొట్టు తీసిన వెల్లుల్లి రేకులను జార్ నిండా నింపాలి.

తర్వాత ఈ జార్‌లో వెల్లుల్లి రేకులు మునిగేంత వరకు తేనె పోయాలి.
తరువాత జార్‌కు మూత పెట్టి పొడిగా, వెచ్చగా ఉండే ప్రదేశంలో 2 నుంచి 4 వారాల పాటు అలాగే ఉంచాలి.

అప్పుడప్పుడు ఈ మిశ్రమాన్ని పొడి గరిటతో కలుపుతూ ఉండాలి.
2 నుంచి 4 వారాల వ్యవధిలో తేనె వెల్లుల్లి రేకుల్లో నిండిపోతుంది.

ఇలా తయారైన మిశ్రమాన్ని 3 నెలల్లోగా ఉపయోగించాలి.
దీన్ని పొడిగా ఉన్న చెంచాలతోనే వాడుకోవాలి. తేమ అసలు దరి చేరకూడదు.

ఈ మిశ్రమాన్ని 1 టీస్పూన్ మోతాదులో రోజులో కొద్ది గంటలకు ఒకసారి అనారోగ్య లక్షణాలు దూరమయ్యే వరకు తినాలి. ఇలా చేస్తే శరీరంలోని రోగ నిరోధక శక్తి రెట్టింపవుతుంది.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ మిశ్రమంలో అధికంగా ఉండడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...