తులసి మొక్క ఆరోగ్యానికి ఎంత మంచిదంటే…………

September 16, 2016

తులసిమొక్క పవిత్రమైనదే కాదు అత్యంత ఆరోగ్యకరమైనది కూడా.ఎంతో పవిత్రతను, ప్రాధా న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పేర్కొ న్నారు. తులసిలో ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయని…. అవి ఎన్నోరకాల జబ్బులను నయం చేస్తాయని వైద్య నిపుణులు చెబతున్నారు.

tul

అవి ఏమిటంటే………. తులసితో…

కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.

అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.

జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.

బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయి.

తులసి ఆకులతో చేసిన కషాయం……….

జ్వరాన్ని తగ్గిస్తుంది.

అల్సర్‌ల నుంచి రక్షిస్తుంది.

రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది.

కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహద పడుతుంది.

నోటినుంచి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.

అలర్జీలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుంచి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది.

దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా పెరట్లో తులసి మొక్క ఉంటుంది.
ఎందుకంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు.

తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.
అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తులసీ దళాలను వేసిస్తారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...