తమలపాకును ఇలా చేస్తే …….. 8 ఆరోగ్య లాభాలు

November 27, 2016

ప్రజలంతా సాధారణంగా తమలపాకులు కేవలం శుభకార్యాల్లో మరియు భోజనాల అనంతరం తాంబూలంగానే వాడుతూ ఉంటారు. కానీ తమలపాకులు పలు అనారోగ్యాలకు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.
మరి తమలపాకు ద్వారా ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం .

1. చెంచాడు తమలపాకు రసంలో చిటికెడు మిరియాలపొడి కలిపి 3 పూటలా తీసుకుంటే
జ్వరం తీవ్రత తగ్గుతుంది.

2. ఆకలి లేకపోవటం, నీరసం వంటి సమస్యలకు తమలపాకు షర్బత్ మంచి ఔషధంగా పనిచేస్తుంది.

3. మొండి కురుపులు, గాయాలకు నెయ్యి రాసిన లేత తమలపాకుతో కట్టుకడితే
రెండోరోజుకు తగ్గుముఖం పడుతుంది.

tamalapaku

4. భరించలేని తలనొప్పితో సతమతమయ్యే పరిస్థితిలో ముక్కుల్లో 2 చుక్కల తమలపాకు రసం వేసుకుంటే
తలనొప్పి ఉపశమిస్తుంది.

5. భోధకాలు బాధితులు రోజూ 10 తమలపాకులను ఉప్పుతో కలిపి నూరి వేడి నీళ్లతో తీసుకుంటే
క్రమంగా వాపు తగ్గుతుంది.

6. వేడిగా ఉండే తమలపాకు రసాన్ని కొబ్బరినూనెతో కలిపి వెన్నుకు మర్ధన చేయడం వల్ల
తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

7. తమలపాకుల్లో యాలకులు, లవంగం చేర్చి భోజనం అనంతరం సేవిస్తే,
ఆహారం చక్కగా జీర్ణమవటమే గాక మలబద్దకం వంటి సమస్యలూ ఉండవు.

8. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...