జొన్నరొట్టె ఎంత బలవర్ధకమైన ఆహారమంటే………….

September 28, 2016

జొన్నరొట్టెతో ఎముక పుష్టి..
*********************
జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం.
జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బియ్యం, గోధుమలతో పోలిస్తే.. జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది.
ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు కూడా వీటిలో ఎక్కువ.

jonna-rotte

గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది.

ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి.

శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్నగింజల్లో ఉంది.

ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది.

నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది.

వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు
జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి.

జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తిని పెంపొంది,
అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ది చేస్తాయి.

2 Comments

on జొన్నరొట్టె ఎంత బలవర్ధకమైన ఆహారమంటే…………..
  1. Darla venkateswara rao
    |

    good

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...