జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటే…. ఎలా కాపాడుకోవాలంటే…..

September 26, 2016

జుట్టును ఊడిపోకుండా కాపాడుకోండిలా………
*************************************
జుట్టు ఊడిపోతూ ఉందని చాలా మంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు.
మహిళలు అయితే తీవ్ర వేదనకు గురయ్యే సంఘటనలు కూడా మనకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి.

ఎందుకంటే , తలపై జుట్టు ఉంటేనే ముఖానికి అందం. అటువంటి జుట్టును ఊడిపోకుండా
ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

juttu

తల స్నానం చేసిన తర్వాత తలను తడిగా ఉంచుకోకండి. దీనివల్ల చుండ్రు ఏర్పడుతుంది.

అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో వెంటనే జుట్టు ఆరబెట్టుకోవడం మంచిది కాదు.
జుట్టును నెమ్మదిగా టవల్ తో తుడిచి పొడిగా అయ్యేట్లు చేయాలి.

జుట్టు తడిగా ఉన్నప్పుడు తల దువ్వుకోకూడదు. కుదుళ్ళలో నుండి వెంట్రుకలు ఊడి వస్తాయి.

తలకు వారానికి కనీసం రెండుసార్లయినా నూనె రాసుకుంటే వెంట్రుకలు బలంగా ఉంటాయి.
జుట్టు జిడ్డుగా ఉన్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించకండి.

చుండ్రు విపరీతంగా ఉంటే ,
నాలుగు టమోటాలను తీసుకొని వాటిని మెత్తగా నలిపి
ఆ గుజ్జును తలకు బాగా పట్టించండి.
రెండు నిమిషాలు మర్దనా చెయ్యండి.
ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...