జీలకర్రతో క్యాన్సర్ ప్రభావం తగ్గడమేగాక…….. ఇంకా ఎన్నో జబ్బులు మాయం

October 12, 2016

మ‌న ఇంట్లో వంటల్లో వేసే జీల‌క‌ర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అస‌లు ఆ జీలకర్రని పొడి చేసి… తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జీలకర్ర పొడి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని సమతూకంలో ఉంచుతుంది.

jeela-karra

కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణ శక్తి పెంపొందిస్తుంది.
కడుపులోని గ్యాస్‌ని బయటకి నెట్టి వేస్తుంది.

అరటిపండుని తీసుకొని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే.. హాయిగా నిద్ర వస్తుంది. అధిక బరువు తగ్గుతారు.

లైంగిక ఆరోగ్యం పెంపొందాలంటే.. జీలకర్ర పొడిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని, ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది.
పైత్యరసం ఫాట్స్‌ను విఛిన్నం చేయటంలో పోషకాలను గ్రహించటంలో సహాయపడుతుంది.
దీనివల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...