జయహో వీర జవాన్

September 30, 2016

మన కమాండోలు బురదలో పాక్కుంటూ వెళ్ళి ఎలా దాడి చేసారో తెలుసుకుంటే ……
“ జయహో వీర జవాన్ “ అని ఎలుగెత్తి కీర్తిస్తారు

బుధవారం రాత్రి 8 : 00 గంటలకే ఆపరేషన్ కు అంతా సిద్దమైంది.

25 మంది మెరికల్లాంటి కమాండోలు రెడీగా ఉన్నారు ,
పై నుండి ఆదేశాలు ఎప్పుడు వస్తాయా అని…….

అంతా సిద్దమైంది …………
సమయం అర్ధరాత్రి 12 : 30 గంటలు ……….. తెల్లారితే గురువారం……..

druv-hel

అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ లు “ ధ్రువ్ “ లలో బయలుదేరారు .

ఆ హెలీకాప్టర్ లు నియంత్రణ రేఖ దాటి …… పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశించాయి .

నిర్దేశించిన ప్రాంతాల్లో కమాండోలను వదిలిపెట్టి …… హెలికాప్టర్లు తిరిగి వచ్చేసాయి .

మన సైనికులు శత్రువుల ఆధీనంలో ఉన్న గడ్డ మీద కాలుపెట్టారు.

సముద్ర మట్టానికి సుమారుగా 6 నుంచి 8 వేల అడుగుల ఎత్తున్న పర్వతాలు , దట్టమైన అడవులు అత్యంత క్లిష్టమైన వాతావరణంలో ……….. మన కమాండోలు బృందాలుగా విడిపోయారు.

తమకు నిర్దేశించిన లక్ష్యాల వైపు అత్యంత వేగంగా కదిలారు .

నియంత్రణ రేఖ దాటి 300 మీటర్ల నుండి 3 కిలోమీటర్ల వరకు లోపలికి చొచ్చుకెళ్ళారు.

తమ కదలికలు శత్రువుల కంటపడకుండా ……
బురదలో, మట్టిలో , రాళ్ళపై పాక్కుంటూనే వెళ్ళారు.

భీమ్బార్ , కెల్ , తట్టాపానీ , లీఫా ప్రాంతాల్లో
నిఘా వర్గాలు ముందుగానే గుర్తించిన లక్ష్యాల వద్దకు చేరుకున్నారు.

అంతే…. ఇక ఆలస్యం చేయలేదు……..
దాడి మొదలైంది……. ఎంత వేగంగా అంటే………
శత్రుమూకలు ఏం జరుగుతుందో తెలుసుకొని ,
ప్రతిస్పందించేలోపే అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు.

ముందుగా పొగ గ్రెనేడ్ లను విసిరి ………..
ఉగ్రవాదులను , వారి వెంట ఉన్న పాక్ సైనికులను కకావికలం చేసారు.

తూటాల వర్షం కురిపిస్తూ వేటాడారు…..
38 మంది తీవ్రవాదులను 9 మంది పాక్ సైనికులను మట్టుబెట్టారు.

నాలుగు గంటల్లో …….. అంటే తెల్లవారుజామున 4 : 30 గంటలలోపు ఆపరేషన్ ముగిసింది .

ఏడు ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా పెట్టుకొని, పూర్తిగా ద్వంసం చేసి…………..
ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన మన కమాండోలు తిరిగి వచ్చేసారు .

ఈ మొత్తం ఆపరేషన్ ను మన సైనికులు హెల్మెట్ కెమేరాలతో చిత్రీకరించారు .

ప్రతి ఒక్క భారతీయుడూ గర్వపడేలా ………….

“ జయహో వీర జవాన్ “ అని నినదించేలా చేసిన
మన కమాండోలకు శతసహస్ర కోటి వందనాలు.

2 Comments

on జయహో వీర జవాన్.
  1. Shivanandu
    |

    Jai jai johar

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...