చైనా కు షాక్ ఇచ్చిన భారత్

November 8, 2016

పాకిస్తాన్ ను వెనకేసుకొస్తూ , భారత్ కు పక్కలో బల్లెం లా తయారైన చైనా కు
భారత్ షాక్ మీద షాక్ లు ఇస్తోంది.

హిందూమహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంపై పెత్తనం చెలాయించాలనుకుంటోన్న చైనాకు
చెక్ పెట్టేందుకు మోదీ సర్కారు రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

ఈ నెల 11న మోదీ జపాన్‌ పర్యటన సందర్భంగా
షిన్‌మేవా తయారీ పద్దెనిమిది యూఎస్ 2ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఖరీదు చేయాలని భారత్ నిర్ణయించింది.

i-us-2-i-air

వాస్తవానికి రెండేళ్ల క్రితమే దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు జరిగాయి.
గగనతలంతో పాటు నీటిపై కూడా ల్యాండై లక్ష్యాలను చేధించగల ఈ ఉభయచర ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ మరింత శక్తిమంతమౌతాయి.

యూఎస్ 2ఐ ఎయిర్‌క్రాఫ్ట్ పరిధి 4,700కిలోమీటర్లు. 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నా
సముద్రంపై జాగ్రత్తగా ల్యాండ్ అవగలిగే సామర్ధ్యం ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కుంది.

అత్యంత వేగంగా సైనికులను హాట్‌జోన్‌లకు చేరవేయగలదు. అత్యవసర సమయాల్లో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌తో
ఎన్నో ప్రయోజనాలుంటాయని నేవీ నిపుణులు చెబుతున్నారు.

జపాన్‌తో చేసుకోబోయే ఒప్పందంపై ఈ నెల ఏడున రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలో
జరిగే సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకుంటారు.
ఈ ఒప్పందం విలువ 11 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది.
ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ ప్రైవేట్ కంపెనీదే అయినా పరికరాల అసెంబ్లింగ్‌ భారత్‌లోనే చేపడతారు.

హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌తో కుదరబోయే ఈ డీల్ మేక్ ఇన్ ఇండియా కిందకు వస్తుందని చెబుతున్నారు. 2016 నుంచి మొదలుకొని ప్రతి ఏడాదీ రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచీ మూడు వరకూ
సరఫరా చేస్తారు. డీల్ గురించి తెలియడంతో డ్రాగన్ వెన్నులో వణుకు మొదలైంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...