చుండ్రు తగ్గాలంటే …… ఈ చిట్కాలు పాటించండి చాలు

October 6, 2016

తలలో చుండ్రు తగ్గాలంటే ఏం చేయాలంటే …

ఈ రోజుల్లో చుండ్రు అంటే తెలియని వారు ఉండరు. సహజంగా మన చర్మం వాతావరణం ని రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురులాగా ఉండే క్రొవ్వు పదార్ధాన్ని వదులుతూ ఉంటుంది.
దీనివలన చర్మం మెత్తగా ఉంచబడుతుంది.

తలలో ఈ జిగురు గాలి సరిగా తగలక పేడుగా కట్టి పెచ్చులు పెచ్చులుగా ఊడుతూఉంటుంది.
స్నానం రోజు శరీరం వరకే చేసి తల మనది కాదన్నట్లుగా కొందరు వదిలేస్తారు.
దాని వలన తల శుభ్రం కాక చుండ్రు వస్తుంది.

షాంపూలు తరచుగా వాడేవారికి కూడా అందులో కెమికల్స్ చర్మం ఫై పొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేటట్లు చేస్తాయి. షాంపూ పెట్టిన రోజున బాగానే వుండవచ్చు కాని తరువాత రోజునుండి వాటి నష్టం బయటపడుతుంది.
***
dandruff

చుండ్రు పోవడానికి చిట్కాలు:

1. ప్రతిరోజు చన్నీళ్ళ తల స్నానం చేయండి, వేడి నీళ్లు తలకు పోయకూడదు.
నీళ్లు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి (బావిలో నీటి లాగా) ఆ నీళ్లు పోసుకోండి.
***

2. వారానికి, పది రోజులకొకసారి కుంకుడు కాయ రసంతో తలంటుకోండి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు పొడి తలకు ఆ రసం బాగా పట్టించి 5, 10 నిమిషములు అలా వుంచి అప్పుడు చన్నీటి స్నానం చేయండి. ప్రతి రోజు ఇలా కుంకుడు రసంతో ఏడు, ఎనిమిది రోజులు చేయవచ్చు (సమస్య ఎక్కువగా వున్నవారే ప్రతిరోజూ కుంకుడు రసం వాడండి).
***

3. తల ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోండి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుంది అనుకుంటారు. రోజూ తల స్నానం చేసేవారికి ఏమీ కాదు. చలి కాలంలో చర్మం తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు మనం కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గినట్లే. చుండ్రుకు కూడా నూనె రాయవచ్చు. మన పెద్దలు నూనె బాగా రాసుకున్నందుకే చుండ్రు రాలేదు.
***

4. తల నూనె జిడ్డుగా వుంటే ప్రతి రోజూ (ఒక చేకా లేదా కాయ) నిమ్మరసాన్ని తలకు (తల పై చర్మానికి) రాసుకొని తల స్నానం చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు గ్రంధులు ఊరించే ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం బాగా పనికొస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...