చివరి శ్వాసలో కూడా ఆజాద్ తెగువ , త్యాగం ఎంత గొప్పవంటే…….

September 25, 2016

చంద్ర శేఖర్ ఆజాద్ – ఈ పేరు వింటే చాలు….. స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో ఆయన ప్రాణత్యాగం చేసిన విధానం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తుంది, గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది.

అలాంటి మహానుభావుడు తన ప్రాణత్యాగం సమయంలో కూడా చూపిన ధైర్యం , సాహసం ఎంత గొప్పవో ఒక్కసారి చదవండి.

ajad

1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ……..
ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతిని,
డబ్బుకు గడ్డితిన్న ఓ యువకుడు ఉప్పందించాడు.

నాలుగు వ్యాన్‌లలో పోలీసులను ఎక్కించుకుని,
పోలీసు అధికారులు లార్ట్‌బావర్, విశే్వశ్వర సిన్నాహలు ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరారు.

పోలీసులంతా చుట్టుముట్టారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. అయినా ఆజాద్ బెదిరిపోలేదు. వెనుకడుగు వేయలేదు. పార్కులోని చెట్లను ఆసరాగా చేసుకొని , ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాడు.

ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ తొడ నుండి దూసుకుపోయింది.

అయినా, ఆ బాధను లెక్కచేయక అజాద్ తన రివాల్వర్‌తో లార్ట్ బావర్‌ను కాల్చాడు.

వెంటనే విశే్వశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా అజాద్ కుడిచేతికి గాయమైంది.
వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది.

అక్కడ మోహరించి వున్న పోలీసు బలగాలు మరోసారి గుళ్ల వర్షం కురిపిస్తుండగా…..
అజాద్ తన రివాల్వర్‌తో శత్రువులను చెండాడుతూ ధైర్యంగా పోరాటం సాగిస్తున్నాడు.

చివరకు ఆజాద్ రివాల్వర్‌లో ఒక గుండు మాత్రమే మిగిలింది.

అంతటి విపత్కర పరిస్థితిల్లో కూడా ………
సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకు పోయేందుకు సహకరించాడు.

‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ ……….
చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ……
పిస్తోలు లోని చివరి బుల్లెట్ ను తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు.

అక్కడే భరతమాత ఒడిలో తుది శ్వాస విడిచాడు.

అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన.
భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...