చిన్నారుల గుండె జబ్బులకు పూర్తిగా ఉచిత వైద్యం

September 23, 2016

చిన్నారులకు ఎటువంటి గుండె జబ్బు ఉన్నా కూడా ఒక్క పైసా వైద్య ఖర్చు లేకుండా
పూర్తి ఉచితంగా వైద్యం చేసే ఆసుపత్రి ఒకటి ఉందని మీకు తెలుసా………..?

అవును …….మీరు చదువుతున్నది నిజమే………..
చిన్నారుల గుండెకు సంబంధించిన ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా
ఉచితంగా చేసే ఆసుపత్రి చత్తీస్ ఘడ్ లోని నయా రాయ్ పూర్ లో ఉంది.

sss-free-hospital-naya-raipur

శ్రీ సత్యసాయి సంజీవిని ఆసుపత్రిగా పిలువబడే ఈ ఆసుపత్రిలో
చిన్నారులకు ప్రపంచ స్థాయి కార్పోరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది.

గుండెకు సంబంధించి మీరు ఇంతకముందు ఇతర ఆసుపత్రులలో చూపించుకున్న మెడికల్ రిపోర్టులను తీసుకొని, ఉదయం ఆరు గంటల కల్లా ఈ ఆసుపత్రి ముందు క్యూ లో ఉన్నట్లయితే ,
ఏడు గంటల నుండి టోకెన్ల ద్వారా ఆసుపత్రిలోపలికి అనుమతిస్తారు.

పేషంట్ దృవీకరణ కోసం ఓటర్ కార్డుగానీ, ఆధార్ కార్డుగానీ, రేషన్ కార్డు గానీ ఉంటే మంచిది. పేషంట్ తో పాటు మరొకరిని కూడా తోడుగా లోపలికి అనుమతిస్తారు.అక్కడ లోపల ఉన్న ప్రత్యేక గదిలో పాత మెడికల్ రిపోర్టులను పరిశీలించి , ముందుగా రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత యూనిక్ పేషంట్ ఐడీ కార్డు ఇస్తారు.

ఆదివారాలు మరియు శెలవు దినాలు తప్ప , మిగతా అన్ని రోజుల్లోనూ ఆసుపత్రి పనిచేస్తుంది.

ఇంకా ఏవైనా ఇతర వివరాలు కావాలనుకుంటే…………

SRI SATHYA SAI SANJEEVANI HOSPITAL

Sector 2, Naya Raipur,
Chhattisgarh, INDIA.
Email: [email protected]
Contact: +91 – 771 – 2970325 / +91 – 94242 – 07140

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...