చలికాలంలో వచ్చే జబ్బులకు ఇంటి వైద్యంతో ఇలా చెక్ పెట్టేయండి

November 6, 2016

చలికాలం వచ్చిందంటే చాలు …….వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశమున్నది. ఈ కాలంలో ఇలాంటి రోగాలకు ముందే చెక్‌పెట్టేందుకు ఇంటి వైద్యం అందుబాటులో ఉన్నది.
ఎలాంటి దుష్ప్రభావాలు చూపని చౌకైన చికిత్స ఇంట్లోనే చేసుకోండిమరి.

ఎండు మిర్చి……
***************
చలికాలంలో ఎండుమిర్చి చాలా మేలు చేస్తుంది. ముక్కులో పేరుకునే శ్లేష్మం, ఊపిరిత్తుల్లో నిండే నంజును కరిగించి త్వరగా బయటకు పంపడంలో తోడ్పతుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది.

chali

బెల్లం…….
***********
అజీర్తితో బాధపడుతున్నారా? భోజనం చేశాక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరించండి. శీతాకాలంలో తరచూ ఇబ్బందే పెట్టే జలుబు నుంచి ఉపశమనం కోసం అల్లం పొడితో బెల్లం కలిపి తీసుకోండి. శొంఠి పొడి, బెల్లం కలిపి తిన్నా గొంతు గరగర తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.

అల్లం……
************
కూరలు, ముఖ్యంగా మాసాహారం రుచిగా ఉండేందుకు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వాడతారు. రోజూ తగినంత అల్లం తీసుకుంటే ఒంట్లో పైత్యం తగ్గుతుంది. అల్లంరబ్బా తీసుకున్నా ఫలితం ఉంటుంది. చక్కెర అల్లం, లేదా బెల్లం అల్లం కలిపి దంచి రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటే పైత్యంతో పాటు తిమ్మిర్లు కూడా తగ్గుతాయి.

వెల్లుల్లి …….
**************
చలికాలంలో రక్తనాళాలు మూసుకుపోకుండా సడలింపజేసేందుకు ఎల్లిపాయలు ఉపయోగపడుతాయి. తగిన మోతాదులో ఆహారంలో ఎల్లిపాయలు తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. చలినుంచి కాస్త వేడినిస్తుంది.
పాలు, తేనెలో పసుపు కలిపి తీసుకోండి..

పసుపు……
************

ఎవరికైనా గాయం తగిలి రక్తం కారుతున్నదంటే ముందుగా గుర్తొచ్చేది పసుపే. తగిలిన చోట పసుపు రాస్తే రక్తం కారడం ఆగిపోతుంది. చిన్నచిన్నగాయాలే అయితే ఎలాంటి మందులూ వాడకపోయినా పసుపుతో నయమైపోతాయి. ఎన్నో ఔషధ గుణాలున్న పసుపును రోగనిరోధక శక్తి పెంపునకు తోడ్పాటునందిస్తుంది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించగానే ఉదయం, రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఫలితముంటుంది. తేనెలో కలిపి తీసుకున్నా ఉపశమనం కలుగుతుంది.

యాలకులు …..
*************
సైనస్, దగ్గు, జలుబు నివారణకు యాలకులు కూడా దోహదపడతాయి. చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా ఎక్కువమంది బద్ధకస్తులుగా తయారవుతారు. ఇలా బద్ధకం నుంచి ఉత్తేజం నింపేందుకు గ్లాసు నీటిలో రెండు మూడు యాలకులు వేసి మరిగించి చల్లారాక తాగాలి. దీనికి కొంచెం తేనెను కూడా జోడించి పడుకునే ముందు తాగితే మరింత ఫలితం ఉంటుంది.

దాల్చిన చెక్క……
****************
బిర్యానీ, బగారా తయారీలో దాల్చిన చెక్కను ఎక్కువగా వినియోగిస్తారు. దాల్చినచెక్కకు మంచి వాసనే కాదు ఔషధ గుణాలూ ఎక్కువే ఉన్నాయి. మ ధుమేహం ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నీరసాన్ని దూరం చేస్తుంది. రోజూ చిన్నపాటి ముక్కను నోట్లో వేసుకుని మెళ్లగా నమిలితే నోటి దుర్వాసన పోవడమే కాదు, శరీరం చురుగ్గా కదులుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...