చలికాలంలో గుండెను ఎలా కాపాడుకోవాలంటే………….

September 22, 2016

చలికాలంలో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారా……..?

ఆహారంలో జంక్ ఫుడ్ , ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారా…….? అయితే జాగ్రత్త పడండి.

ఎండాకాలం , వర్షా కాలం కంటే చలి కాలంలో గుండెకు తీవ్ర ప్రమాదం ఉంటుందనే విషయం
మీకు తెలుసా…….? అయితే ఒక్కసారి దీనిని చదవండి.

వాతావరణం చలిగా ఉన్నప్పుడు మన శరీరం ముందుగా , తనను తాను వేడిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాని మూలంగా మన రక్తనాళాలు కుంచించుకుపోతాయి.
ఈ పరిస్థితుల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగి , రక్తపోటు అధికమవుతుంది.

hrt

చలి గాలులు మన శరీరంలోని వేడిని లాగేసుకుంటాయి కాబట్టి గుండెపై మరింత ప్రభావం పడుతుంది.
దీనివల్ల కొందరిలో శరీరం లోపల అవసరమైన ఉష్ణోగ్రతకు సరిపడినంత శక్తిని
ఉత్పత్తి చేసుకోలేని స్థితికి దారి తీస్తుంది.

అలాంటి సందర్భంలో వణుకు రావడం , తికమకగా ప్రవర్తించడం లేదా మగత గా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ స్థితిలో గుండె మరింత వేగంగా పని చేయాల్సి రావడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చలిగాలులు మన శ్వాసపై చూపే విపరీత ప్రభావం వల్ల కూడా గుండెకు హాని జరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది.

కాబట్టి ఈ చలికాలంలో తల నుండి వేడి బయటకు వెళ్ళకుండా మఫ్లర్ లను గానీ , మంకీ క్యాప్ లను గానీ వాడటం ఎంతో మంచిది. అంతేగాక ముక్కుకు , నోటికి కర్చీఫ్ లను గానీ, చిన్నపాటి రుమాలును గానీ చుట్టుకుంటే గాలి కాస్త వేడిక్కిన తర్వాతే ఊపిరితిత్తులలోకి చేరుతుంది కాబట్టి గుండెకు అకస్మాత్తుగా జరిగే ప్రమాదం నుండి రక్షించుకోవచ్చు.

మరో ముఖ్య విషయమేమిటంటే ,

మనలో చాలా మంది చలి వాతావరణంలో వేడిగా ఉన్న ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అధిక ఆయిల్ వాడకం అనేది ఈ చలికాలంలో గుండెకు ఏమాత్రం మంచిది కాదు. అంతేగాక ఈ కాలంలో మానసిక ఒత్తిడికి సాధ్యమైనంత దూరంగా ఉండటం వల్ల ఆకస్మిక గుండెపోటు ప్రమాదం నుండి బయటపడొచ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...