చర్మ వ్యాధులతో బాధ పదే వాళ్లకు అతి సులువైన , చవకైన ఇంటి వైద్యాలు

November 20, 2016

వివిధ రకాల చర్మ వ్యాధులకు అనేక రకాల ఇంటి వైద్యాలు :
*******************************************
కృష్ణ తులసి ఆకులు, నిమ్మపండు రసం కలిపి మెత్తగా నూరి ఆ గుజ్జును రెండు పూటలా పైన పట్టిస్తుంటే ఎంతో కాలం నుండీ వేధించే గజ్జి, చిడుము, తామర, దురదలు మొదలైన చర్మ సమస్యలు అతిసులువుగా హరించిపోతాయి.

తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.

జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెకాయలు లేకుండా పోతాయి.

skin

తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతాయి.

వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలే్టట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.

పసుపుపొడి 3 గ్రాములు, ఉసిరిక పొడి 6 గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధి.
మారేడు ఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీ్రంలో ఇరుక్కున్న ముళ్ళు, మేకులు బయటకొస్తాయి.

తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. అతి త్వరగా మచ్చలు పోతాయి.

తులసి, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా హరించిపోతాయి.

స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు, నిమ్మ పండు రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలు,
దద్దుర్లు హరించి శరీరం కాంతివంతంగా మారుతుంది.

తులశాకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరినతరువాత
స్నానం చేస్తుంటే శోభి త్వరగా తగ్గుతుంది.

చర్మంపైన కిరోసినాయిల్ మాటిమాటికీ పూస్తుంటే గజ్జి, తామర వంటి చర్మరోగాలు తగ్గిపోతాయి.

మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు పోతాయి.

వేపనూనె రెండుచుక్కలు కప్పు పాలతో మిశ్రి కలిపి తాగుతుంటే చర్మరోగాలు చెదరిపోతాయి .

గరికగడ్డి, మంచి పసుపు (ఇంట్లో కొట్టుకున్నది) సమంగా కొంచెం నీరు కలిపి మెత్తగానూరి పైన రుద్దుతూవుంటే దురదలు, దద్దుర్లు, చర్మరోగాలు హరించిపోతాయి.

కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మం పైన పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారవుతుంది, అలాంటివారు ప్రతిరోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు తీసుకుని మెత్తగా నూరి ఆముద్దను పైన వేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగా వున్న చర్మం తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది.

చర్మ వ్యాధులు వున్నవారికెవరికైనా వారి శరీరంలో సల్ఫర్ లోపించిందని గమనించాలి. భారతీయ గోమూత్రంలొ సల్ఫర్ విరివిగా వుంటుంది. గోమూత్రం లోపలికి తీసుకుంటూ, పై పూతగా వాడుకుంటుంటే మూడు నెలలో చర్మ రోగాలే కాకుండా సొరియాసిస్, ఎక్జిమా,మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు , దగ్గు(20 ఏళ్ళగా వున్నా దగ్గులు కూడా), జలుబు పూర్తిగా పోతుంది.

చర్మం పై నల్ల మచ్చలు తగ్గాలంటే ……..

1. జాజికాయను నీటిలో అరగదీసి గంధం పూయాలి.
2. దోసకాయ రసము తీసి మచ్చలపైన పూయాలి.
3. తోటకుర లేదా కారెట్ రసముతో ఒక చిటికెడు పసుపు చేర్చి రోజూ ఉదయం తాగాలి.
4. చేతులు అందంగా కాంతివంతంగా ఉండాలంటే ఒక స్పూను పెరుగు తరచు చేతులకు వ్రాస్తూ ఉండాలి.
5. రావిచెట్టు బెరడు గంధంగా తీసి పూసిన నల్లమచ్చలు పోతాయి.
6. అల్లం రసాన్ని ఆముదముతో కలిపి చర్మము మీద ఏర్పడిన మచ్చ్లల మీద రాస్తే మచ్చలు పోతాయి.
7. కాలిన పుండ్లు మాడిన తరువాత ఆ చోట తేనెతో ముంచిన దూది వేసి కట్టుకడుతూ ఉంటే కాలిన మచ్చలు పోతాయి.

బెల్లం, వాము సమభాగాలుగా కలిపి దంచి, రేగిపండ్లంత మాత్రలు చేసి నిలువ వుంచుకుని పూటకు ఒక మాత్ర చొప్పున రెండు లేక మూడు పూటలా ఆవనూనెలో ముంచుకొని తింటూ వుంటే దద్దుర్లు తగ్గుతాయి.

వాము 100 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు అన్ని పొడిచేసి, ఈ పొడిని రోజూ అరస్పూను తింటుంటే జీర్ణశక్తి బాగుపడి, రక్త శుద్ధి జరిగి ముఖ సౌందర్యం బాగుంటుంది.

కలబంద గుజ్జు, పసుపు కలిపి మెత్తగానూరి పూస్తుంటే చరంపై వచ్చిన కురుపులు మానిపోతాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...