గ్రహణ మొర్రి చిన్నారులకు ఆపరేషన్లు చేసి , స్పీచ్ తెరఫీ ఇచ్చే ఆసుపత్రి

November 27, 2016

తమకు పుట్టే పిల్లలు అందంగా పుట్టాలనీ, ఎల్లకాలం ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలనీ ప్రతి తల్లీతండ్రీ కోరుకోవడం సాధారణమైన విషయమే. అయితే కొన్నిసార్లు పుట్టే పిల్లలు కొన్ని లోపాలతో పుట్టినపుడు అది వారి తల్లితండ్రులకు గుండెల నిండా బాధను మిగులుస్తుంది.

ఇలా పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే లోపాలు కొన్నిసార్లు అనువంశికంగా సంభవిస్తే
మరికొన్నిసార్లు తల్లి గర్భంలో పిండస్థ శిశువుకు లభించిన వాతావరణం కారణంగా కూడా ఏర్పడవచ్చు.

gsr-hospital

ఇలా పుట్టుకతోనే పిల్లల్లో సంభవించే ఓ లోపంగా గ్రహణ మొర్రిని చెప్పుకోవచ్చు. నోటికి బయట ఉండే పై పెదవి సక్రమంగా ఉండకుండా ముక్కుకు దిగువన చీలి ఉంటుంది. దీనివల్ల సదరు బిడ్డ పై పెదవి రెండు తమ్మెలులాగా మనకు కనిపిస్తుంది.

గ్రహణ మొర్రి రావడానికి కారణం అనువంశిక లోపాలైనా, ఇతర కారణాలైనా కావొచ్చు. ఈ లోపంతో బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. గ్రహణ మొర్రి కారణంగా నోరు సరిగ్గా మూసుకోకపోవడం ఓ లోపమైతే నోటిలోని భాగాలన్నీ బయటకే తెలుస్తూ బిడ్డ ముఖం చూసేందుకు అందవికారంగా కన్పిస్తుంది.

అలాగే గ్రహణ మొర్రి కారణంగా తల్లి యొక్క స్తన్యం నోటితో పట్టుకోలేక బిడ్డ పాలు తాగడం ఇబ్బంది అవుతుంది. అలాగే ఒకవేళ బిడ్డ పాలు తాగినా ఆ పాలు ఒక్కోసారి ముక్కులోకి పోయి బిడ్డకు ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. ఇవి మాత్రమే కాకుండా గ్రహణ మొర్రి కారణంగానూ భవిష్యత్‌లోనూ బిడ్డకు సమస్యలు తలెత్తుతాయి. రాను రాను మాటలు రావడం కష్టమవుతుంది.

ఇలాంటి చిన్నారులకు ఆపరేషన్లు చేసి , స్పీచ్ తెరఫీ లు ఇస్తే చిన్నారుల భవిష్యత్తు బాగుంటుంది.
అలా ఆపరేషన్లు చేసే ఆసుపత్రి వివరాలు ఇవి.

Address:

GSR HOSPITAL
17-1-383/55, Vinay nagar Colony,
IS Sadan, Hyderabad,
Telangana 500059

Phone: 040 6576 4884

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...