గ్యాస్ స్టవ్ ప్రక్కనే సింక్ ఉందా ……. అయితే ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం

November 11, 2016

గ్యాస్ స్టవ్ ప్రక్కనే సింక్ ఉందా ……… అయితే ఇలా చేస్తే చాలా ప్రమాదం
*********************************************************
మనలో చాలా మంది ఇళ్ళల్లో గ్యాస్ స్టవ్ ప్రక్కనే సింక్ ఉంటుంది.
ఎందుకంటే వంట చేసుకున్న తర్వాత పాత్రలను కడగడానికి గానీ లేదా తిన్న ప్లేట్లను శుభ్రం చేయడానికి గానీ అనువుగా ఉంటుందని వంట రూమ్ లలో స్టవ్ ఉన్న ప్రాంతానికి దగ్గరలోనే సింక్ లను
ఏర్పాటు చేసుకొని ఉంటారు.

gas

ఆ సింక్ లలో వివిధ ఆహార పదార్థాలు ఉన్న పాత్రలను శుభ్రం చేస్తాం కాబట్టి కొన్ని రకాల పురుగులు లేదా వివిధ కీటకాలు సింక్ ల వద్దకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అదే విధంగా వంట గదుల్లో…. అందులోనూ ముఖ్యంగా సింకుల్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి.

ఆ పురుగులను , బొద్దింకలను చంపడానికి సాధారణంగా BAYGON , HIT , RAID , NUVAN ……. లాంటి ఇంసేక్ట్ కిల్లర్స్ ను వాడతాము.

ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ………..
ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్న సమయంలో , ప్రక్కనే ఉన్న సింక్ లలో బొద్దింకలు గానీ ఇతర కీటకాలుగానీ కనిపిస్తే BAYGON , HIT , RAID , NUVAN ……. లాంటి ఇంసేక్ట్ కిల్లర్స్ తో స్ప్రే చేయండి.

అది మీ ప్రాణాలకు , మీ ఇంటికి చాలా ప్రమాదకరం.

ఎందుకంటే ,

ఇంసేక్ట్ కిల్లర్స్ లో ఉండే మందు మండే స్వభావం కలిగి ఉంటుంది.
గ్యాస్ స్టవ్ మీద మంట ఉన్నప్పుడు ప్రక్కనే ఉన్న సింక్ లలో వీటిని స్ప్రే చేస్తే
వెంటనే మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది.

ఎలాగంటే , మనం స్ప్రే చేసినప్పుడు లోపల ఉన్న మందు బయట గాలిలో ఉన్న ఆక్సిజన్ తో
చాలా త్వరగా కలిసిపోయి , మంటలను అతి త్వరగా క్షణాలలో వ్యాపింపజేస్తుంది.
తద్వారా మొత్తం ఇంటికే మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది.

కాబట్టి , గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు ,
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రక్కనే ఉన్న సింక్ లలో ఇంసేక్ట్ కిల్లర్స్ ను స్ప్రే చేయకండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...