గ్యాస్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం

November 16, 2016

గ్యాస్ వాడే వినియోగదారులందరికీ బీమా రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ)కు సంబంధించి దురదృష్టకర ఘటన జరిగితే
లిఖితపూర్వకంగా గ్యాస్‌ డీలర్‌‌కు తెలియచేయాలి.

ఆ డీలర్‌ విషయాన్ని వెంటనే సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి, బీమా కంపెనీకి తెలియచేస్తారు.

ప్రమాదం కారణంగా తలెత్తే బీమా క్లయిమ్‌లకు చేయా ల్సిన అన్ని పనులను పూర్తి చేయడంలో
సహకారం అందిస్తామని ఆయిల్‌ కార్పొరేషన్లు ప్రకటించాయి.

gass

పబ్లిక్‌ లయబిలిటీ బీమా పాలసీ..

• మరణం సంభవించిన పక్షంలో ప్రతి ఘటన, ప్రతి వ్యక్తికి రూ.6లక్షల వ్యక్తిగత బీమా రక్షణ.

• ప్రతి ఘటనకు రూ.30 లక్షల వరకు వైద్య ఖర్చులు,
ప్రతి వ్యక్తికి అత్యధికంగా రూ.2 లక్షల వరకు ఉంటుంది.
ఒక్కొక్కరికి రూ.25 వేల వరకు తక్షణ సాయం.

• అధీకృత డీలర్‌ రిజిస్టరు ప్రాంగణంలో
అత్యధికంగా రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తారు.
దీనికి కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...