గుండెపోటు వచ్చిన వెంటనే , ప్రాణాలు కాపాడే టాబ్లెట్లు ఏమిటంటే ……

November 8, 2016

ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా గుండె నొప్పితో విలవిలలాడితే ,
ఇంట్లో ఉన్న అందరికీ చేతులూ కాళ్ళూ ఆడవు. ఏం జరుగుతుందోనన్న భయంతో …..
తీవ్రంగా ఆందోళన చెంది , గట్టిగా అరవడం లేదా చుట్టూ చేరి ఏడవడం గానీ చేస్తారు.
ఇది చాలా చాలా పెద్ద పొరపాటు.
రోగిని చుట్టుముట్టి అలా చేసినట్లయితే రోగి ఇంకా భయాందోళనకు గురై ప్రాణాపాయం సంభవించవచ్చు.

hrt

ఆ సమయంలో రోగి ప్రాణాలు కాపాడుకోవడానికి మనం ఏం చేయాలంటే…………

రోగికి గుండెనొప్పిగా అనిపించిన వెంటనే డిస్ప్రిన్ – 300 mg మాత్రను నీటిలో కలిపి ,
కూర్చోబెట్టిగానీ …. పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకిలేపి ఆ నీటిని త్రాగించాలి.
ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది.

ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా రోగి శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా
ఏదో ఒక వాహనంలో రోగిని ఆసుపత్రికి తరలించాలి.

డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టో కైనేజ్ ఇంజెక్షన్ కు సమానంగా పనిచేస్తుంది.
అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం.

ఆ మాత్రను నీళ్ళలో కలిపి తాగించడం వలన ……. వెంటనే అది శరీరంలో కలిసిపోతుంది.
ఇక డిస్ప్రిన్ , సార్బి ట్రేట్ ….. ఈ రెండూ ఇవ్వడం వలన రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా విలువైనది.
కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని , నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్ కు చేర్చడం చాలా ముఖ్యం.

కొందరు దడ వచ్చిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు. గుండె వేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని సింకోస్ అటాక్ అంటారు . ఇది గుండె జబ్బుకు సూచన .

గుండె దడతో పడిపోయిన వారు , తర్వాత తేరుకొని లేచి నడవగలరు. అప్పుడు ఒకసారి ఈసీజీ తీసి , అవసరమైతే తదుపరి పరీక్షలు చేయవలసి ఉంటుంది.

1 Comment

on గుండెపోటు వచ్చిన వెంటనే , ప్రాణాలు కాపాడే టాబ్లెట్లు ఏమిటంటే …….
  1. Naveen
    |

    Good imparmation

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...