క్యాల్షియం టాబ్లెట్లు వాడుతున్నారా ……? అయితే గుండెకు ముప్పు పొంచి ఉన్నట్లే

November 26, 2016

క్యాల్షియం టాబ్లెట్లు వాడితే , ఎముకలకు మంచిదని ….. చాలా మంది డాక్టర్ల సూచన లేకుండానే సొంతంగా వాడేస్తుంటారు. అది ఎంత మాత్రమూ ఆరోగ్యానికి మంచిది కాదు.

కాల్షియంను మాత్రల రూపంలో తీసుకుంటే గుండెకు చేటని తాజా అధ్యయనం హెచ్చరించింది. ధమనుల్లో రాళ్లు పేరుకోవడం, గుండె పోటు తదితర రుగ్మతలు చుట్టుమట్టే ప్రమాదముందని వెల్లడించింది.
అయితే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం మంచిదేనని తెలిపింది.

calcium

అమెరికాలోని జాన్స్‌హాప్కిన్స్‌ వైద్య వర్సిటీ నిపుణులు దీన్ని నిర్వహించారు.
2,742 మందిపై పదేళ్లలో చేపట్టిన వివిధ పరీక్షల ఫలితాలను విశ్లేషించిన అనంతరం
వారు తాజా అవగాహనకు వచ్చారు.

రక్త నాళాల వ్యవస్థ, గుండెపై కాల్షియం మాత్రలు దుష్ప్రభావాలు చూపిస్తాయని
తమ పరిశోధనలో సృష్టమైనట్లు దీనిలో పాలుపంచుకున్న ఎరినో మైఖోస్‌ తెలిపారు.

ముఖ్యంగా వృద్ధుల్లో కాల్షియం మాత్రలు పూర్తిగా ఎముకలకు అందడంలేదని, ఇంకా మూత్రం గుండా బయటకు రావడంలేదని చెప్పారు. శరీర కణజాలంలో ఇవి పేరుకుంటూ ఉండొచ్చని ఆయన వివరించారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...