క్యారెట్ జ్యూస్ త్రాగితే గుండెకు , కళ్ళకు ఎంత మంచిదంటే………

November 16, 2016

క్యారెట్‌ను త‌ర‌చూ మ‌న ఆహారంలో తీసుకుంటే……..
మ‌న‌కు ఎంతో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే.

ఎన్నో ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ క్యారెట్ల‌లో ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ప్రతిరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను…….
అలాగే ప‌చ్చిగా తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

carrot-juice

1. మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే
రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

2. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.
కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి.

3. వ‌యస్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి.
ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

4. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

5. డయాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు క్యారెట్ జ్యూస్ ఎంత‌గానో మేలు చేస్తుంది.
బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

6. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. స్వ‌ల్ప అనారోగ్యాల‌ను కూడా త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది.

7. ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తొల‌గిపోతుంది. ర‌క్తం బాగా వృద్ధి చెందుతుంది.

8. ఎముక‌లు దృఢంగా మారుతాయి. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది.
జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

9. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. శ్వాస స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అసిడిటీ రాదు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...