కోడలు ఆడపిల్లను కన్నదని , కోడలికి కారును గిఫ్ట్ గా ఇచ్చిన అత్త

November 6, 2016

ఆడపిల్లను కనిందని కోడళ్ళను రకరకాలుగా వేధించే అత్తలను ఎంతో మందిని మీరు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఈ విషయాన్ని చదివితే ….. ఆమె అందరిలాంటి అత్త కాదని తప్పకుండా అంటారు.

ఆ అత్తకు ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం. కోడలు గర్భవతి కాగానే…. ఆమెకు ఆడపిల్లే పుట్టాలని అందరు దేవుళ్ళనూ పూజలు చేసి వేడుకుంది. ఆ కోడలు మహాలక్ష్మి లాంటి అమ్మాయికి జన్మనిచ్చింది.

ఆ అత్త ఆశ, కోరికను తీర్చిన కోడలుకు ఏకంగా రూ.10 లక్షల విలువైన హోండా సిటీ కారు బహుమతిగా ఇచ్చింది. పాపకు జన్మనిచ్చిన కోడలును నెత్తినపెట్టుకుంది. బంధువులు, ఆప్తులను పిలిచి పార్టీ ఇచ్చింది.

car-gift

అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. హమీర్ పూర్ జిల్లా కేంద్రం. ప్రేమాదేవి అనే ఇంటి యజమానురాలు.
ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ మెంట్ తీసుకుంది.

రెండేళ్ల క్రితం కొడుక్కి పెళ్లి చేసింది. కోడలు ఖుష్బూ. గృహిణి.
ఖుష్బూ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి అత్తలా కాకుండా.. తల్లిలా దగ్గరుండి అన్నీ చూసుకుంది.

ఇటీవలే కోడలు ఓ ఆడపిల్లకు జన్మ ఇవ్వటంతో అత్త పెద్ద హంగామా చేసింది.

మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. ఇంటికే కళ.
వాళ్లను పెంచటం కష్టం కాదు. ఎందులోనూ అబ్బాయిలతో అమ్మాయిలు తీసిపోరు.

నేనూ ఓ ఆడపిల్లనే కదా.. అంటూ కొత్తగా నాన్నమ్మ అయిన ప్రేమాదేవి చెబుతుంటే………
అందరూ ఆశ్చర్యంగా చూడటమే కాదు.. వింటున్నారంట.

ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చంపేస్తున్నారు… పుట్టిన తర్వాత వీధుల్లో పడేస్తున్నారు..
మరికొందరు పురిట్లోనే చంపుతున్న ఘటనలు జరుగుతున్న టైంలో..

ఓ అత్త.. అయిన ప్రేమాదేవి పార్టీలు, బహుమతులు ఇవ్వటం సంచలనం అయ్యింది.
సోషల్ మీడియాలో అయితే ఈ అత్తకు హ్యాట్సాప్ చెబుతున్నారు అమ్మాయిలు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...