కీర దోసతో ఆరోగ్య లాభాలెన్నో…………..

September 19, 2016

కీరదోసం వల్ల ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగం.

కీరదోసలో నీటిశాతం ఎక్కువ. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్‌ బాధించదు. శరీరంలో తేమ శాతం పెరిగి, వేడి తగ్గుతుంది. వ్యర్థాలను బయటకు పంపే శక్తీ దీనిలోని పోషకాల సొంతం. దాహం కూడా తీరుతుంది.

కీరదోస రసంలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి.
ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

దీనిలో దొరికే విటమిన్‌ ‘కె’ నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

keera-dosa

ఎముకల్ని దృఢంగా ఉంచడంలోనూ కీలకపాత్ర వహిస్తుంది.

అజీర్తితో ఇబ్బంది పడేవారు కీరదోసను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది.
దీనిలో ఉండే ఖనిజ లవణాలు ఉదర సంబంధిత సమస్యలతో పోరాడతాయి. అజీర్తి లేకుండా చూస్తాయి.

దీన్లోని మేలు చేసే కార్బోహైడ్రేట్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి.

బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజూ ఉదయం అల్పాహారంతో పాటూ కొన్ని కీరదోస ముక్కల్ని తీసుకొంటే తక్కువ కెలొరీలూ ఎక్కువ శక్తీ అందుతాయి.

నోటి దుర్వాసనతో బాధపడేవారు కీరదోస ముక్కల్ని నమిలితే ఫలితం ఉంటుంది.

చిగుళ్లకు సంబంధించిన సమస్యలూ దూరమవుతాయి.

మధుమేహం ఉన్నవారు కీరదోసని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ శాతం వృద్ధి అవుతుంది.

1 Comment

on కీర దోసతో ఆరోగ్య లాభాలెన్నో…………...
  1. T RAMESH
    |

    ivanni chemicalsto pandistunaru,arogyalu chedipotunayu baga,gosedyamto friuts vegetables,rice ekada dorukutayo cheppandi

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...