కిడ్నీలలో రాళ్ళతో బాధపడుతున్నారా…………?

September 6, 2016

కిడ్నీలో రాళ్ళు
***********
చిన్న పిల్లల్లో అయితే జన్యుపరమైన కిడ్నీలోపాలున్న వారికి వస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వల్ల పెద్ద వాళ్లకు కిడ్నీలు దెబ్బతింటాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేసే వారికి, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది.

కిడ్నీలో రాళ్లు – లక్షణాలు

* భరించలేనినొప్పి. మూత్రంలో రక్తం పడడం. ఈ పరిస్థితి కిడ్నీ, యూరేటర్‌, యూరెత్ర గోడల్లో ఏదో ఒకటికానీ, అన్ని కానీ దెబ్బతిన్నప్పుడు సంభవిస్తుంది.

* మూత్రంలో చీము రావడం.

* విసర్జనసమయంలో మార్గం మంటగా అనిపించడం. మూత్రంతోపాటు చిన్న రాళ్లు వచ్చినప్పుడు లేదా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు కనిపిస్తుంది.

* మూత్రం పరిమాణం తగ్గడం. యురెత్రాలో కానీ, మూత్రాశయంలోకానీ లేదా రెండింటిలో కానీ రాళ్లున్నప్పుడు జరగొచ్చు.

* తల తిరగడం, వాంతులవడం, చలి జ్వరం కూడా రావొచ్చు.

* రాయి యురేటర్‌ని బ్లాక్‌ చేయడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయడం.

* ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం.

* జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్త కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తిలేకపోవడం. బరువు తగ్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

kidneys
జాగ్రత్తలు

* ఎక్కువ నీళ్లు తాగాలి. రోజుకు తప్పనిసరిగా రెండు నుండి రెండున్నర లీటర్ల మూత్రాన్ని విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి.

* ప్రోటీన్‌, నైట్రోజన్‌, సోడియం ఉన్న పదార్థాలను తగ్గించాలి.

* ఆక్సిలేట్‌ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్‌, పాలకూర, చాక్లెట్లు వంటి వాటిని మినహాయించాలి.

* కాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చేసుకోవాలి. అలాగే కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. కాబట్టి వైద్యుని పర్యవేక్షణలో ఆహార నియమాలను అనుసరిస్తే మంచిది. అరటి, నిమ్మ, క్యారట్‌, కాకరకాయ, పైనాపిల్‌, కొబ్బరినీళ్లు, బార్లి, ఉలవలు మేలు చేస్తాయి.

* ఆల్కహాలు తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌ కలుగుతుంది. క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడే అవకాశం ఎక్కువ.

* నారింజ పళ్ల రసానికి కాల్షియం ఆక్సిలేట్‌ రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది.

విటమిన్‌-సి ఎక్కువగా తీసుకోవడం కూడా రాళ్ల సమస్యకు దారితీసే అవకాశముంది. కూల్‌డ్రింకులను మినహాయించాలి.

కాఫీలోని కెఫిన్‌ అనే పదార్థం మూత్రంలోని కాల్షియం విసర్జనకు దోహదం చేస్తుంది. కాబట్టి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలోని నివారించుకోవచ్చని పరిశోధనలు వెల్లడించాయి.

4 Comments

on కిడ్నీలలో రాళ్ళతో బాధపడుతున్నారా…………?.
  1. Rajesh Tamarapalli
    |

    Very good information,tnku

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...