కాలి పగుళ్ళు వేధిస్తుంటే ………. ఇంట్లోనే ఈ వైద్యాలతో చెక్ పెట్టేయండి

November 20, 2016

చాలా మందిలో కాలి పగుళ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది.
ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి.

కాలి పగుళ్ళ నివారణకు చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు…
మరికొందరు వైద్యుల సలహాతో వివిధ రకాల మందులు వాడినా
ఆశించిన ఫలితం లేక విసుగు చెందిన వారూ ఉంటారు.

అలాంటి వారికి నిపుణులు సూచిస్తున్న కొన్ని వైద్యాలను గురించి తెలుసుకుందాం.

తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానుతుండడం,
మురికికి ఎక్కువగా ఎక్స్ పోజ్ కావడం కాలి పగుళ్ల సమస్యకు ప్రధాన కారణాలు.

అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు.
పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది.
ఫంగల్ ఇన్ ఫెక్షన్ కూడా దారి తీయవచ్చు.

hkalipagulull

* కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఓ రూపునిస్తుంది. మైనం ఆవనూనె తో కలిపి రాత్రి పూట
పగుళ్లపై రాసి చూడండి. తెల్లవారే సరికి మార్పును గమనిస్తారు.

* గ్లిజరిన్, రోజ్ వాటర్ తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు..
అలా 15 రోజుల పాటు రాసి చూడండి.

* నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట.
నిద్రించే ముందు పాదాలకు మర్ధన చేయాలి.

* అరటి పండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది.
పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది.

* పసుపు, తులసి , కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని
వీటికి అలోవెరా జెల్ కలిపి రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...