కార్తీక మాసంలో దీపాలు వెలిగించడంలోని ఆంతర్యం ఏమిటంటే……..

November 7, 2016

కార్తీక మాసంలో దీపాలను వెలిగించడంలోని ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా……..?

మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడంలోని ఆంతర్యం ఏమిటో మీకు తెలుసా……..?

karteeka-deepam

అయితే దీనిని ఒక్కసారి చదవండి.

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా,
మనోవికాసానికి, ఆనందానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.

మహిళామణులంతా కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు.

చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి
జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.

పైగా ఈ కార్తీక మాసం శరదృతువులో అరుదెంచటం విశేషం.
మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.

అందుకే మహిళలు కార్తీక మాసంలో దీపాలను వెలిగించాలనే సాంప్రదాయాన్ని మన పూర్వీకులు ఏర్పరిచారు.

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...