కార్డు లేకుండానే ఎటియం నుండి డబ్బులు డ్రా చేయొచ్చు , ఎలాగంటే……

November 18, 2016

కొన్నేళ్ళ క్రిందట డ‌బ్బు అవ‌స‌ర‌మైతే అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు వెళ్లి న‌గ‌దును తీసుకోవాల్సి వ‌చ్చేది. అప్పుడు శ్రమతో పాటు సమయం కూడా ఎక్కువగా పట్టేది.

తర్వాతి కాలంలో టెక్నాల‌జీ పెర‌గ‌డంతో ఏటీఎమ్‌లలో పిన్‌నంబ‌ర్ స‌హాయంతో ఎక్క‌డినుంచైనా డ‌బ్బును విత్‌డ్రాచేసుకునే అవ‌కాశం క‌లిగింది. విత్ డ్రా చేసుకోవ‌డ‌మే కాదు కార్డ్ టూ కార్డ్ ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకునే వెస‌లుబాటు క‌లిగింది.

cardless-money

తాజాగా ఏటీఎం కార్డు లేకుండా కూడా మ‌నీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు..

అదెలాగ అంటే……..

అన్నిటికీ ఆధార్ కార్డే ఆధార‌మైన ఈ రోజుల్లో డ‌బ్బులు తీసుకునేందుకు కూడా
బ్యాంకు అకౌంట్ నంబ‌ర్ మీ ఆధార్ నంబ‌ర్‌తో ముడిప‌డి ఉంటుంది.

దీంతో ఏటీఎం మెషీన్ల‌లో మీ ఆధార్‌నంబ‌ర్ టైప్ చేస్తే చాలు డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.

అంతేకాదు మీ వేలిముద్ర వేసి కూడా మ‌నీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు .

అలాంటి ఏటీఎం మెషీన్‌ల‌ను తొలిసారిగా బెంగ‌ళూరులోని జ‌య‌న‌గ‌ర్ డీసీబీ బ్యాంకు ప్రాంగ‌ణంలో ప్రారంభించారు ఆధార్ రూప‌క‌ర్త నంద‌న్ నీలెకని.

పిన్‌నెంబ‌ర్ లేకుండానే ఖాతాదారులు వేలిముద్ర స‌హాయంతో డ‌బ్బులు డ్రా చేసుకోవ‌చ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...