కల్తీ బియ్యాన్ని తింటే క్యాన్సర్ వస్తోందా…… బియ్యంలో ఏం కలుపుతున్నారంటే ……

September 19, 2016

బియ్యంలో రాళ్ళు కల్తీ జరుగుతున్నాయనే విషయం మనందరికీ తెలిసిందే.

కానీ బియ్యంలో ప్లాస్టిక్ ను కూడా కల్తీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా………….?

అవును….మీరు చదువుతున్నది నిజమే ………..

బియ్యం మాదిరిగానే ఉండే ప్లాస్టిక్ బియ్యాన్ని తయారుచేసి మనం తినే బియ్యంలో కల్తీ చేస్తున్నారు.
మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

aadhar-copy

చీప్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు పెట్టింది పేరైన చైనా నుండి మన దేశ మార్కెట్లలోకి ఈ ప్లాస్టిక్ బియ్యం వస్తోంది. మామూలు బియ్యానికీ , ప్లాస్టిక్ బియ్యానికీ ఎలాంటి తేడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని మరీ కల్తీ చేస్తున్నారు.

సింగపూర్ లోని , కొరియాలోని పత్రికలు చైనా నుండి ఇతర ఆసియా దేశాలకు ప్లాస్టిక్ బియ్యం ఎగుమతి అవుతోందని పేర్కొన్నాయి. బంగాళా దుంపలు, చిలగడ దుంపలు , సింథటిక్ రెసిన్ ను కలిపి ప్రాణాంతకమైన ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేస్తున్నట్లుగా తెలియజేసాయి.

చైనాలో ఈ బియ్యాన్ని తయారుచేయడానికి ప్రత్యేకంగా రైస్‌మిల్లులు ఉన్నాయి. సాధారణంగా వడ్లు పట్టే మిల్లు ల్లాగానే ప్లాస్టిక్‌ రైస్‌ మిల్లులు కూడా ఉన్నాయి. ఒక పలుచటి రీలువలే ఉండే ప్లాస్టిక్ రోల్స్ ను మిషన్‌కు ఎక్కిస్తారు. అది బియ్యపు గింజంత సైజులో కటింగయి మామూలు బియ్యంవలే చూడటానికి ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. చైనా నుండి వచ్చిన ఈ ప్లాస్టిక్ బియ్యం కేరళలోని కోజికోడ్ లో భారీ ఎత్తున పట్టుబడింది.

ప్లాస్టిక్ బియ్యం తయారీలో వాడే కొన్నిరకాల ఎడిబుల్ సింథటిక్ రేజిన్స్ కారణంగా , అవి మామూలు బియ్యంలాగే ఉడుకుతాయని , కానీ తింటే ప్లాస్టిక్ రుచి తెలుస్తుందని , ఆ బియ్యాన్ని ఉడికించినప్పుడు వచ్చే గంజి కూడా ప్లాస్టిక్ తెట్టులా ఉంటుందని , అటువంటి ఆహారాన్ని తింటే ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని, ప్రమాదకర క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మనం ఒకరోజులో రెండుపూటలా కల్తీ జరిగిన ప్లాస్టిక్ బియ్యంతో చేసిన అన్నాన్ని తిన్నట్లయితే , ఒక ప్లాస్టిక్ కవర్ కడుపులోకి వెళితే మన ఆరోగ్యానికి ఎంతటి హాని కలిగిస్తుందో……… అంతటి దుష్పలితాలు మనకు కలుగుతాయి.

ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా గుర్తించాలంటే…………..

బియ్యాన్ని ఉడికించినప్పుడు వచ్చే గంజి ప్లాస్టిక్ ( నూనె ) తెట్టులాగా పైకి తేలి ఉంటుంది.

బియ్యం ఉడికిన తర్వాత అన్నం పూర్తిగా గట్టిగా అయిపోయి , అన్నంపై నిప్పు రాజేస్తే ప్లాస్టిక్ లాగా మంట వస్తుంది.

ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , ప్రజల ఆరోగ్య రక్షణలో మీవంతుగా తోడ్పడండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...